రహస్యం రచ్చ.. నిమ్మగడ్డ పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ
Publish Date:Mar 20, 2021
Advertisement
రహస్య లేఖలు లీకయ్యాయి. గవర్నర్ బంగ్లా నుంచి సమాచారం మీడియాకు చేరింది. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి అంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్డును ఆశ్రయించారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. ఎస్‌ఈసీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా అది వేరే బెంచ్‌కు బదిలీ అయింది. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తనకు మధ్య జరిగిన సంభాషణ లీక్ చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్‌తో పంచుకున్న అత్యంత కీలక సమాచారం లీక్ అయిందని, గవర్నర్‌కు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్ అయ్యాయని పిటిషన్‌లో తెలిపారు. ఆ విషయాలన్నీ సామాజిక మాధ్యమాల్లో కనిపించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజ్‌భవన్ ముఖ్య కార్యదర్శిలతో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలను చేర్చారు. ఎస్‌ఈసీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా మరో బెంచ్‌కు బదిలీ అయింది.
http://www.teluguone.com/news/content/ap-sec-nimmagadda-ramesh-kumar-files-petition-in-high-court-for-demanding-cbi-enquiry-on-information-leakage-from-rajbhavan-25-112191.html





