ఇవేం రోడ్లు.. ఇదేం పాలన! జగన్ సర్కార్ పై భగ్గుమంటున్న జనం 

Publish Date:Sep 8, 2021

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచి ఇప్పటివరకు, ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి రావడమే టార్గెట్’గా  ఓట్లు లెక్కలు వేసుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్నమార్గం, సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు సొమ్ములు పంచి, ఓటు బ్యాంకును పెంచుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల సొమ్ములతో ప్రజల ఓట్లు కొని అధికారం నిలుపుకునే రాజకీయ బేహారి రూపం దాల్చారు. ఈ క్రమంలో ఆయన అభివృద్ధిని అటకెక్కించారు. మౌలిక సదుపాయల విషయం పక్కన పెట్టేశారు. 

ఈ రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడా పది కిలో మీటర్ల రోడ్డు వేయలేదు, కనీసం ఉన్న రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. ఫలితంగా, రాష్ట్రంలో చాలావరకు రోడ్లు యమపురికి దగ్గరి దారి,షార్ట్ కట్’గా మారిపోయాయి. అడుగు’కో గుంత, గజానికో గండం అన్నట్లుగా రాష్ట్ర రోడ్లన్నీ అద్వాన్న స్థితికి చేరుకున్నాయి. దానికి తోడు ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లన్నీ మరింత అద్వాన్న స్థితికి చేరుకున్నాయి. బండి కాదు, కాలు కూడా కదలని స్థితికి చేరుకున్నాయి. పరిస్థితి ఇంత అద్వాన్న స్థితికి చేరడంతో, సహజంగానే, ప్రతిపక్షాలు రోడ్లెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం, బీజీపీ, జనసేన పార్టీలు ఆందోళనకు నడుం బిగించాయి. అయితే చిత్రం ఏమంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పటికీ కళ్ళు తెరవలేదు, సరికదా, అదేదో తమ పాద మహిమ అన్నట్లుగా మురిసిపోతున్నారు. ఆ రకంగా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడటంతో రైతులు సంతోషంగా ఉన్నారని అంటూ వర్షాలు తీవ్రంగా పడటం వల్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయని, అంతా తమ పాదమహిమ, దేవుని దయ తప్ప మరొకటి కాదని, తమ ప్రభుత్వం తప్పేమీ లేదని ఆత్మవంచనను అక్కున చేర్చుకున్నారు. అంతే కాదు, ఆడ లేక మద్దెల ఓడన్నట్లు, విపక్ష్లాల మీద, మీడియా మీద కూడా ముఖ్యమంత్రి విరుచుకు పడ్డారు.

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, విపక్షాలు వీధుల కెక్కిన తర్వాత, రోడ్ల దుస్థితిఫై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, అక్టోబర్ నెలాఖరు కల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత, పనుల కాలం మొదలవుతుంది. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి. మళ్లీ వర్షాకాలం వచ్చేలోపు రోడ్లన్నీ బాగుచేయాలి అంటూ అధికారులకు హుకుమజారీ చేశారు.  రోడ్లు బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిందన్నారు. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంటోందని.. ఒక నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. అయితే, ఆ నిధి  ఎప్పుడోనే  నిండుకుందని అధికారాలు గుర్తు చేస్తున్నారు.నిజమే,ప్రభుత్వం నిధిని ఏర్పడు చేసింది, కానీ, అందులో నిధులు వేయడమే మరిచి పోయింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని అధికారాలు సీక్రెట్ గా స్మైల్తున్నారు.   

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై వినూత్నంగా సోషల్ మీడియా వేదికా ఆందోళన చేపట్టిన జనసేన అధినేత పవన్కళ్యాణ్, తాజాగా ప్రభుత్వానికి మరిన్ని వాతలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సోమవారం రహదారులపై నిర్వహించిన సమీక్షలో.. ఎయిర్ పోర్టులు, షిప్పింగ్‌ యార్డుల అభివృద్ధి గురించి మాట్లాడటాన్ని పవన్‌ ప్రస్తావించారు. ‘సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం’ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.అలాగే, వెన్నుముక లేని వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాన్ ఎద్దేవా చేశారు, ‘నిజమే, మంత్రులు అంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతాలే చేసిందని.. చిన్న గోతులను గొయ్యిల్లాగా.. గొయ్యిల్ని కాలువల్లా చేశారు’ అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు.
 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.