Publish Date:Aug 29, 2024
‘ఈ టోపీ మీద కనిపించే మూడు సింహాలూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్’ అని ఆవేశంగా మాట్లాడే సీను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కనిపించడం లేదు. ఆ కనిపించని నాలుగోది సింహం కాదు.. కుందేలు అన్నట్టుగా తయారయ్యారు. ఐదేళ్ళపాటు అధికారపార్టీ నాయకులకు, వారి అనుచరులకు, కుటుంబ సభ్యులకు సెల్యూట్లు చేయడం అలవాటు అయిపోయిన ప్రాణాలు కదా మరి. అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వారి సేవలో తరించడానికే ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నామధ్య రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆమె పోలీసులను నిలదీస్తూ మాట్లాడిన విధానం వార్తల్లోకి వచ్చింది. ఎలాంటి అధికార హోదా లోకపోయినప్పటికీ ఆమె దర్పంగా మాట్లాడుతున్నా పోలీసులు ఎదురు మాట్లాడలేని పరిస్థితిలో వున్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎవరికీ విధేయులుగా వుండాల్సిన అవసరం లేదని అన్నారు. అయినప్పటికీ, అలవాటుపడ్డ ప్రాణాలు మారడం లేదు.
ఈమధ్య చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలలో స్థానిక పోలీసులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడమ్ గారితో ఫొటోలు కూడా దిగారు. ఎమ్మెల్యేగారి సతీమణికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ పోలీసులు అక్కడకు వెళ్ళడం మీద జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. దాంతో చిలకలూరిపేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బానాయుడు, రమేష్, ఎస్సైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-police-irresponsibility-25-183857.html
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!