పోలీసుల నెత్తి మీదా ‘జగనన్న టోపీ’!

Publish Date:Feb 2, 2022

Advertisement

‘అన్నం పెట్టిన చెయ్యినే కరిచాడు’ అనే సామెత జగన్ రెడ్డి సర్కార్ కు సరిగ్గా సరిపోతుందేమో! ప్రశ్నించిన ప్రత్యర్థి పార్టీల నాయకులు, శ్రేణులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరినైనా సరే పోలీసుతో దారుణంగా అణచివేస్తోంది ఏపీ సర్కార్.. ప్రశ్నించిన వారిని అణచివేసేందుకు పావుగా వాడుకుంటున్న పోలీసుల నెత్తిన కూడా ఫిట్ మెంట్ పేరుతో ‘జగనన్న టోపీ’ పెట్టింది సర్కార్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళనలో కీలక అంశమైన హెచ్ఆర్ఏ తగ్గింపు విషయంలో పోలీసులకు కూడా శఠగోపం పెట్టింది. వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పోలీసులకు కూడా హెచ్ఆర్ఏ, డీఏ, సిటీ అలవెన్సుల్లో కోత కోసేసింది.

పోలీసులకు హెచ్ఆర్ఏ తగ్గింపు వర్తించదని కొద్ది రోజులుగా ప్రచారం చేసిన వైసీపీ సర్కార్ వాస్తవానికి వారికి కూడా పెద్ద కోత పెట్టింది. పైకి 23.29 శాతం ఫిట్ మెంట్ లెక్కలు వేసి మొత్తం కలిపితే.. పోలీసుల జీతం ఏమాత్రం తగ్గలేదని కలరింగ్ ఇచ్చింది. అయితే.. తాజాగా వచ్చిన పే స్లిప్పులు చూస్తే పోలీసులకు దిమ్మ దిరిగి బొమ్మ కనిపించింది. పే స్లిప్పులు చూసిన పోలీసులకు షాక్ తగిలినట్లయింది. పే స్లిప్పుల ప్రకారం పోలీసుల హెచ్ఆర్ఏలో తేడా వేలల్లో కనిపించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో తోక తొక్కిన త్రాచులా వారు యూనియన్ నేతలు, ప్రభుత్వ పెద్దలపైనా పోలీసు భాషలో తూర్పార పడుతున్నారు.

పైగా సీఎం జగన్ రెడ్డి పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తున్నట్లు పైకి చెబుతుంటారని, వాస్తవంగా తమకు వీక్లీ ఆఫ్ లు అమలు కావడం లేదని వారు గుర్రుగా ఉన్నారు. సిబ్బంది కొరత పేరుతో పోలీసు బాసులు తమను వీక్లీ ఆఫ్ తీసుకోనివ్వడం లేదని, దాంతో తమకు పనిభారం కూడా ఎక్కువ ఉంటోందని ఆవేదనగా ఉంటున్నారు. పోలీసులకు సెలవుల సరెండర్ ఇవ్వడం లేదట. పని భారం ఉన్నా, వీక్లీ ఆఫ్ లు ఇవ్వకపోయినా.. సర్కార్ కు తాము ఎంతగా తోడ్పాటు అందిస్తున్నామని వారు వాపోతున్నారు. చివరికి తమకు హెచ్ఆర్ఏ కూడా తగ్గించేసి జగన్ రెడ్డి సర్కార్ ద్రోహం చేసిందని పూర్తిస్థాయిలో ఫైరవుతున్నారు. రాత్రనకా పగలనకా ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నామని, కోవిడ్ సమయంలో సైతం తాము కుటుంబాలను వదిలి రోడ్లపై విధులు నిర్వర్తించిన తమను జగన్ సర్కార్ ఇంత మోసం చేస్తుందా? అని ఆగ్రహంతో ఉన్నారు.

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి మహా నగరాల్లో సిటీ అలవెన్సులు కూడా రద్దు చేసి, హెచ్ఆర్ఏను 20 నుంచి 8 శాతానికి తగ్గించడాన్ని పోలీసులు తూర్పారపడుతున్నారు. చివరికి డీఏను కూడా 2 నుంచి 3 శాతం తగ్గించడం పట్ల పోలీసులు భగ్గుమంటున్నారు. ఒక పక్కన తమకు ఉన్న సౌకర్యాలు, రావాల్సిన అలవెన్సులు తగ్గించేస్తూ.. మరో పక్కన పోలీసులకు హెచ్ఆర్ఏ తగ్గబోదంటూ అసత్య ప్రచారం చేయడం ఏంటని వారు నిలదీస్తున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీఓలు మాదిరిగా తాము ఆందోళన చేయలేమని పోలీసులు ఆవేదనతో చెబుతున్నారు. అయితే.. వారు చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉందని పోలీసులు చెబుతుండడం విశేషం. తమను అన్ని విధాలా వాడుకుని, అడ్డంగా మోసం చేసిన జగన్ రెడ్డి సర్కార్ కు ఇకపై పోలీసులు వర్క్ టూ రూల్ పాటిస్తారేమో!
 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.