ఒక్క నాటికీ క్షమించరు.. ఒక్క శాతం దాట నీయరు!

Publish Date:Sep 22, 2023

Advertisement

బీజేపీ,తెలుగు దేశం లు చిరకాల మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయినా,  ఆ రెండు పార్టీలు మళ్ళీ అన్ని సార్లు కలిసి ఒకటయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృమిత్ర  సంబంధాలు, తారు మారైన సందర్భాలు చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి. అంతే కాదు అప్పట్లో, ఉభయ పార్టీల నేతలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.

ఆ సమయంలోనే,  వాజ్ పేయి, అద్వానీ, వెంకయ్య నాయుడు వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాలలో టీడీపీని  విశ్వసనీయ మిత్ర పక్షంగా, చంద్రబాబును విశ్వనీయ మిత్రునిగా పేర్కొన్నారు. గౌరవించారు.  టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీని, బీజేపీ నాయకులను అదే విధంగా గౌరవించారు.అలాగే రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయతారకంగా రెండు పార్టీలూకూ  లబ్ధి చేకూరింది. రెండు పార్టీలూ ప్రయోజనం పొందాయి. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ పార్టీలూ కలిసి పోటీ   చేయడమే కాదు కేంద్ర, రాష్టం మంత్రి వర్గాలాలలో భాగస్వాములయ్యాయి. 

అయితే  అదంతా చరిత్ర. ఒకప్పటి మాట. నిజానికి  ఒక్క తెలుగు దేశం పార్టీని, పార్టీ నాయకులను మాత్రమే కాదు, ఇతర మిత్ర పక్షాలను, మిత్ర పక్షాల నాయకులను కూడా వాజ్ పేయి, అద్వానీ నాయకత్వంలో  పనిచేసిన బీజేపీ నాయకులు గౌరవించారు. సంకీర్ణ ధర్మాన్ని చక్కగా పాటించారు. అందుకే  ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ళ పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని చక్కగా  నడిపించారు. అంతవరకు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు  సుస్థిర పాలన ఇవ్వలేవన్న ఆనాటి కాంగ్రెస్ నాయకుల విశ్వాసాన్ని వాజ్ పేయి  వమ్ము చేశారు. సరే  ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిం నుకోండి అది వేరే విషయం.  

అయితే  బీజేపీ ప్రస్తుత నాయకత్వం ,(మోడీ షా జోడీ) మిత్ర పక్షాలకు గౌరవం ఇవ్వక పోవడమే కాదు, అవకాశం చిక్కితే మిత్ర పక్షాల అడ్రస్ గల్లంతు చేసేందుకు వెనకాడేది  లేదని చేతల్లో చూపిస్తున్నది. అందుకే, సిద్దాంత సారూప్యం ఉన్న శివ సేన, అకాలీ దళ్, ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే  విశ్వనీయ మిత్ర పక్షంగా మెచ్చుకున్న టీడీపీ సహా అనేక మిత్ర పక్షాలు బీజేపీకి దూరమ య్యాయి.ఇప్పుడుకేంద్రంలో ఉన్నది పేరుకు మాత్రమే ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వం. మోదీ మంత్రివర్గంలో  మిత్ర పక్షాలకు పెద్దగా స్థానం లేదు. మిత్ర పక్షాల నుంచి కాబినెట్ లో స్థానం దక్కిన మంత్రులకు పెద్ద ప్రాముఖ్యత లేదు. వాస్తవానికి మోడీ కేబినెట్ లో   అమిత్ షా మినహా మిగిలిన మంత్రులెవరికీ పెద్దగా ప్రాధాన్యత, ప్రాముఖ్యతా లేదు.  

 ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే  రాష్ట్రంలో బీజేపీకి నిండా ఒక్క శాతం ఓటు కూడా లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో తెలుగుదేశం తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నోటాతో పోటీ పడింది. బీజేపీకి నిండా ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మాజీ మిత్ర పక్షం తెలుగుదేశం అడ్డు తొలిగించి ఆ తర్వాత వైసీపీనీ టార్గెట్ చేసే దీర్ఘకాల వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఆ వ్యూహంలో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని మట్టు పెట్టే కుట్రలు పన్నుతున్నది. అందులో భాగంగానే  చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అయితే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా, చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో తెర వెనక కథ నడుపుతున్నది కేంద్రంలోని కమల దళమే అయినా తెర ముందు మాత్రం రాష్ట్ర నేతలతో మరో రకం డ్రామాను నడిపిస్తోందనే నిన్నటి అనుమానాలు, ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పడు  వాస్తవం అని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పరిశీలకుల విశ్లేషణలే కాదు సామాన్య జనం కూడా అదే అనుకుంటున్నారు. ఇంతవరకూ జనసేనతో కలిసి  తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని  వైసేపీని గద్దె దించడంలో బీజేపీ తమ వంతు పాత్రను పోషిస్తుందని అనుకున్న, ఆశించిన విశ్లేషకులు సైతం ఇప్పుడు బీజీపే అసలు రంగు బయట పడిందని అంటున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో వామ్మో  బీజేపీ క్రిమినల్ బ్రెయిన్ మరీ ఇంత షార్పా అని విస్తుపోతున్నారు.

అంత క్రిమినెల్ బ్రెయిన్ ఉంది కనుకనే జగన్ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడమన్నట్లల్లా ఆడేలా చేసుకోగలిగారని అంటున్నారు. అయితే ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు , కుతంత్రాలకు పాల్పడినా, ప్రత్యేక హోదా సహా, ఇచ్చిన విభజన హామీలు ఏవీ నెరవేర్చక పోగా, వైసీపీ అరాచక,అవినీతి ప్రభుత్వానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర ప్రజలు ఒక్క నాటికీ క్షమించరనీ,  ఒక్క  శాతం ఓటుకు మించి రానీయరనీ అంటున్నారు.  

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.