జగన్ ఘనత..అప్పుల్లో ఏపీ టాప్

Publish Date:Jun 24, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ అధోగతి పాలు చేసేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టాప్ లో నిలిపారు. ఆయన మాత్రమే సాధించగలిగిన ఘనత ఇదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ జగన్ ఏపీని అగ్రస్థానంలో నిలిపింది అప్పుల్లో. ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రస్తుతం 14 లక్షల కోట్లపైనే ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

ఈ అప్పులకు వడ్డీయే రోజులు దాదాపు 300 కోట్ల రూపాయలు అంటే జగన్ ఆర్థిక విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.  ప్రస్తుతం ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది. సంసద సృష్టి, అభివృద్ధి, పురోగతి అన్న మాటలకే అర్ధం తెలియని జగన్.. తన పాలనా కాలమంతా అప్పులు చేసి తన కోసం ప్యాలస్ లు నిర్మించుకోవడమే పాలనా భావించారు. అలాగే అరకొర సంక్షేమానికి, ఉద్యోగుల వేతనాలకు కూడా జగన్ అప్పుల మీదే ఆధారపడ్డారు. మద్యం ఆదాయాన్ని పాతికేళ్లకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. అడ్డగోలుగా నిబంధనలు ఉంటాయన్న విషయాన్నే విస్మరించి అప్పు చేయడమో గొప్ప అన్నట్లుగా ఎడా పెడా అప్పులు తెచ్చేశారు.  

జగన్  ఏడాదిలో పదకొండు నెలలు అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపారంటే.. ఆయన ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అవగతమౌతుంది.  దాదాపు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించేశారు.  ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తుంది. ఇందు కోసం రాష్ట్ర ఆదాయం, కేంద్ర గ్రాంట్లపై ఆధారపడుతుంది. అవి సరిపోనప్పుడు మాత్రమే అప్పులు చేస్తుంది. అయితే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి ఆదాయం వస్తుంది. అది చేసిన అప్పులు తీర్చడానికి, సంక్షేమ పథకాల అమలుకు వినియోగిస్తుంది.

రాబడి ఆధారంగా మాత్రమే ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయడానికి సాహసిస్తుంది. అయితే జగన్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా అసలు ఆదాయం అనేదే లేకుండా చేసుకుని ప్రభుత్వ రోజు వారి కార్యకలాపాల నిర్వహణకు కూడా అప్పులపైనే ఆధారపడింది. తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించడానికి కూడా అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారంటే జగన్ సర్కార్ ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్థంగా ఉందో అర్ధమౌతుంది.   

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.