ఏపీ నూతన సీఎస్ గా జవహర్‌రెడ్డి?

Publish Date:Nov 25, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త  సీఎస్‌గా కేఎస్ జవహర్ ‌రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. మరో సారి సమీర్ శర్మకు ఎక్స్ టెన్షన్ కోరుతారని తొలుత అంతా భావించినా.. జగన్ నుంచి అటువంటి కదలిక ఏదీ కనిపించలేదు.

సమీర్ శర్మ పదవీ విరమణ సమయం సమీపిస్తుండటంతో ఆయనకు మరో ఏడాది పదవీ కాలం పొడగింపునకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందన్న వార్తలు వినవచ్చాయి. అయితే జగన్ సర్కార్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలే చెబుతుండటంతో సమీర్ శర్మ పదవీ కాలం పొడగింపు ఊహాగానాలకు చెక్ పడింది.

స్వయంగా సమీర్ శర్మ కూడా రిటైర్మెంట్ కే మొగ్గు చూపారనీ, ఇందుకు తన ఆరోగ్య పరిస్థితి కారణంగా చెప్పారని అంటున్నారు. దీంతో జగన్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. ఆయన పేరును నేడో రేపో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.  అయితే జవహర్ రెడ్డి విషయానికి వస్తే.. జగన్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ..   జవహర్ రెడ్డి ప్రధాన లేదా కీలక పదవులలో బాధ్యతలు నిర్వహించలేదు. అయితే ఆయనకు  జగన్  ముఖ్యమంత్రి అయిన తరువాత   ఎక్కడ లేని ప్రాధాన్యతా వచ్చి పడింది.

కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మొత్తం జవహర్ రెడ్డి కనుసన్నలలోనే పని చేసింది. తర్వాత ఆయన తనంత తానుగా  కోరుకుని మరీ   టీటీడీ చైర్మన్  పోస్టుకు వెళ్లారు. అయితే అది అతి కొద్ది కాలం మాత్రమే. తరువాత జగన్ ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెచ్చుకుని కీలక బాధ్యతలు అప్పగించారు.  ఇప్పుడు సీఎస్ గా ఆయన పేరునే పరిశీలిస్తున్నారు.  

సమీర్ శర్మ రిటైర్మెంట్ తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీఎస్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది ప్రచారంగానే మిగిలిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ జగన్ అక్రమాస్తుల కేసులో ఆమెపై కేసులు ఆలాగే ఉండటంతో ఆమెకు అవకాశం దక్కలేదని అంటున్నారు.  

ఇక, సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మకు కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్‌లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ చైర్మన్ ‌గానూ ఆయనను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. జవహర్ రెడ్డి  ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.