త్వరలోనే మెగా జాబ్ క్యాలెండర్.. మంత్రి నారాయణ.!

Publish Date:Aug 8, 2026

Advertisement

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే  మెగా జాబ్ క్యాలెండర్  విడుదల చేయనుంది. ఈ విషయాన్ని  రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  నారాయణ   నెల్లూరులో  మీడియా సమావేశంలో చెప్పారు.   ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు, నియామక ప్రక్రియకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్న ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.  విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇప్పటికే 16 వేలకు  పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్న ఆయన.. త్వరలోనే  మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.  

మెగా డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.  ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నందుకే లోకేష్ రాజీనామా చేయాలా అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను  మోసం చేశారని, ఇప్పుడు తమ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ  అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. 

రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ధర్నాలు, నిరసనల డ్రామాలు ఆడుతున్నారని నారాయణ దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ ప్రమాణాలతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పురోగతిని చూసి విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్న ఆయన.. ఆ పార్టీ నిరసన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ నాయకుల నుంచి కూడా   మద్దతు లభించడం లేదన్నారు.  

ప్రభుత్వం త్వరలోనే ప్రకటించబోయే మెగా జాబ్ క్యాలెండర్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.  ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు, నోటిఫికేషన్లు,  పరీక్షల తేదీలు ఎప్పుడు ఉంటాయి అనే  స్పష్టమైన విషయాలపై త్వరలోనే జాబ్ క్యాలండర్ ద్వారా స్పష్టత రానుంది.  కూటమి ప్రభుత్వం నిర్ణీత గడువులోగా పారదర్శక నియామక ప్రక్రియలు పూర్తి చేస్తుందని నిరుద్యోగ యువత ఆశాభావం వ్యక్తం చేస్తోంది.  

AP Mega Job Calendar, Minister P Narayana, Andhra Pradesh,  Government Jobs, Nara Lokesh Teacher Posts. AP Recruitment News

By
en-us Political News

  
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.