ఏపీ స్థానిక ఎన్నికలు.. అందరి దృష్టీ పులివెందులపైనే.!

Publish Date:Aug 26, 2026

Advertisement

ఏపీలో   స్థానిక  ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రం అంతా ఒకెత్తు అయితే కడప జిల్లా అందులోనూ పులివెందుల మరో ఎత్తు అన్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ అధినేత   జగన్  అడ్డా అయిన   పులివెందుల మున్సిపాలిటీని  తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వెస్తున్నది.

అన్నిటికీ మించి ఈ సారి మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిన జరుగుతుండటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇక సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 

గతంలో  వైసీపీ  అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా అలాగే పులివెందులలో జగన్ పునాదులు కదిలించాలన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో తన పట్టు నిలుపుకోవడానికి మజీ సీఎం, వైసీపీధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఇప్పటికే పులివెందుల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ   యువ నేత దుష్యంత్ రెడ్డిని బరిలోకి దింపనుంది. దుష్యంత్ రెడ్డి జగన్ కు సమీపబంధువు. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో అనధికారికంగా ఎలక్షన్ క్యాంపెయి ప్రారంభించేసినట్ల తెలుస్తోంది.  అయితే అదే సమయంలో తెలుగుదేశం కూటమి కూడా పులివెందులలో జగన్ పట్టుకు చెక్ పెట్టి మునిసిపాలిటీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.

పులివెందులతో బీటెక్ రవి తెలుగుదేశం కూటమి తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు.  గతంలో పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో బీటెక్ రవీ పకడ్బందీగా వ్యవహరించి.. తెలుగుదేశం అభ్యర్థిని మట్టి కరిపించి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించారు. అంతకు ముందు..  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి తన వ్యూహాలతో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన బీటెక్ రవి, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పులివెందులలో  సత్తా చాటుతున్నారంటున్నారు. పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా సాధిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంటే.. వైసీపీ పట్టు నిలుపుకోవడానికి శాయశక్తులా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. 
 
AP localbody Elections, Pulivendula Municipal Elections, YCP Candidate Dushyant Reddy, BTech Ravi TDP,Pulivendula Politics, Telugu News, TeluguOne

By
en-us Political News

  
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.