ఏపీ లిక్కర్ టెండర్ స్కామ్..నిందితులకు రిమాండ్..!

Publish Date:Jul 21, 2026

Advertisement

 

ఏపీలో సంచలనం రేపిన మద్యం రవాణా టెండర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఏ1 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఏ4 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ8 కారుమూరి సునీల్‌లను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ముగ్గురికి ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న ఈ ముగ్గురు నిందితులను సిట్ అధికారులు పీటీ (ప్రిజనర్ ట్రాన్సిట్) వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా సిట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు. మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి, కొందరు సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారని, బినామీ సంస్థలకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టినట్లు ఆరోపించారు.

రవాణా ఛార్జీలను అనుచితంగా పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.192 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సిట్ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది. ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం జరిగిందని, పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని సిట్ కోర్టుకు వివరించింది. అలాగే ఆర్థిక లావాదేవీలు, టెండర్ల మంజూరు ప్రక్రియ, నిధుల బదిలీలపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలిపింది.

మరోవైపు, నిందితుల తరఫు న్యాయవాదులు రిమాండ్ అవసరం లేదని, తమ క్లయింట్లపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు ముగ్గురిని ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాలని ఆదేశించింది. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

AP Liquor Transport Tender Scam, AP SIT, Vijayawada ACB Court, Judicial Remand, PT Warrant, Donthireddy Vasudeva Reddy, Kasireddy Rajasekhar Reddy, Karumuri Sunil, Liquor Tender Irregularities, Tender Scam Andhra Pradesh

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.