ఏపీ మద్యం కుంభకోణం కేసు.. తెలుగు రాష్ట్రాలలో ఈడీ సోదాలు

Publish Date:Apr 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసు కున్నాయి. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.  శుక్రవారం(ఏప్రిల్ 24) తెల్లవారు జామునుంచే తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొత్తం 20 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.  హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి పలువురు కీలక వ్యక్తుల ఇళ్లు, కార్యాల యాల్లో  ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు జరిపిన ఏపీ సిఐడి సమర్పించిన నివేదిక ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. 

ఏపీ సి ఐ డి తన విచారణ లో భారీ స్థాయిలో అక్ర మాలు జరిగినట్లు నిర్ధారించడంతో ఈడీ చర్యలు మరింత వేగం పుంజుకు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్70లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో  తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో నగరం లోని మరికొందరు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా అధికారులు రికార్డులు, డిజిటల్ పరిక రాలు, ఆర్థిక లావాదే వీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఉదయం నుంచి కొనసా గుతుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాం శంగా మారాయి. అలాగే ఇదే సమయంలో తిరుపతి, విజయవాడ లోనూ పలువురు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతు న్నాయి.   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిగా , ధనుంజయరెడ్డి, చాణిక్య, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, అవినాష్గౌడ్, ముప్పిడి అవినాష్, సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరుల నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వైసీపీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. అలాగే ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆయన నివాసం బయట ఈడీ అధికారులు వేచి చూస్తున్నారు. 

బ్యాంక్ ఖాతాలు, షెల్ కంపెనీలు, బీనామీ ఆస్తులు, మద్యం సరఫరా ఒప్పందా లకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఏపీ సిఐడి నివేదిక ప్రకారం ఈ లిక్కర్ స్కాం ద్వారా వేల కోట్ల రూపాయలు అక్రమంగా మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈడీ గతంలో పలువురు నిందితుల నుంచి స్టేట్‌మెంట్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజా సోదాల ద్వారా మరిన్ని కీలక ఆధారాలు బయట పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి లో జరుగుతున్న ఈ సోదాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక వ్యక్తులు ఈ కేసులో బయటపడే అవకాశం ఉందని సమాచారం. 

By
en-us Political News

  
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.