ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..!

Publish Date:Jul 20, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరో కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ముగ్గురిని ఏసీబీ అధికారులు పీటీ వారెంట్‌పై తమ అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాదుకు వచ్చారు. అనంతరం ఏసీబీ అధికారులు వాసుదేవ్ రెడ్డి, కాశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కరుమూరి సునీల్ ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈడీ అధికారులు కోర్టు అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకుని వరుసగా మూడు రోజుల పాటు విస్తృతంగా విచారించిన అనంతరం నిన్న ఈ ముగ్గురిని కోర్టు ముందు హాజరు పరచి, జైలుకు తరలించారు.

అయితే ఆ విచారణలో లభించిన సమాచారం, ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, ఇతర కీలక అంశాల ఆధారంగా ఇప్పుడు ఏపీ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి  దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందిన ఏసీబీ అధికారులు జైలుకు వెళ్లి ముగ్గురిని అధికారికంగా తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వారిని విజయవాడకు తరలించారు. లిక్కర్ పాలసీ అమలు, టెండర్ల కేటాయింపు, నిధుల ప్రవాహం, వివిధ సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు ఏపీ ఏసీబీ సేకరించిన ఆధారాలను సమన్వయం చేస్తూ కేసును ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణలో మరికొందరి పాత్రపై కూడా స్పష్టత వచ్చే అవకాశ ముందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

AP Liquor Scam Case, ACB officials,  Vasudev Reddy, Kasireddy Rajasekhar Reddy, Karumuri Sunil, Liquor Policy, CM Chandrababu, Naralokesh, YS Jagan,Vijayawada ACB Court
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి రాసే నీట్ పరీక్ష పత్రాలు లీక్ కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భారీ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏపీలో సంచలనం రేపిన మద్యం రవాణా టెండర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.