Publish Date:Aug 28, 2024
తీగ లాగితే డొంక కదిలిందన్నది సామెత.. కానీ ఏపీలో ఒక తీగ లాగితే ఏకంగా రెండు డొంకలు కదిలాయి. జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూకబ్జాల వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందన్నది వెల్లడి అవుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిల అక్రమాల జాబితా కొండవీటి చాంతాడును మించి పోయిందన్ని పోలీసుల దర్యాప్తులో వెల్లడౌతోంది.
జగన్ హయాంలో పెద్దిరెడ్డి భూదందాల పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగిందనడానికి సాక్ష్యాలను మాయం చేసే క్రమంలో మదలపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేశారన్న ఆరోపణలపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో భూదందాలతో పాటు మద్యం కుంభకోణం గుట్టు కూడా బయటపడింది. ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసులు చేసిన సోదాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల మద్యం దందా వెలుగులోనికి వచ్చింది. సోమవారం (ఆగస్టు 26) సీఐడీ ఉన్నతాధికారులు మదనపల్లె ఫైళ్లదగ్ధం కేసు దర్యాప్తులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాలలో దొరికిన పత్రాలలో వందల కోట్ల నగదు లావాదేవీలు వెలుగు చూశాయి. ఈ లావాదేవీలన్నీ మద్యం కుంభకోణంకు సంబంధించిందేనని తేలింది.
ఏపీలో మద్యం స్కాం మొత్తం.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని తేలింది. డిస్టిలరీలను లాక్కోవడం దగ్గర నుంచి విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశ పెట్టడం వరకూ.. కమిషన్లు దండుకోవడం సహా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అంతే కాకుండా మద్యం విక్రయాలు మొత్తం నగదు లావాదేవీలు జరపడం వెనుక కూడా కుట్ర ఉందని వెల్లడైంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ తర్వాత అధికారులు పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే లిక్కర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా దొరికాయి.
ఇప్పటికే వాసుదేవరెడ్డి దగ్గర తీసుకున్న వాంగ్మూలాల ఆధారంగా ఆ సాక్ష్యాలను విశ్లేషిస్తున్నారు. ఇంకా డిస్టిలరీలు పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలాలు రికార్డు చేశారు. ఏపీలో మ ద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం సీఐడీ సంపాదించిందని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో ఆధారాలు, సమాచారం లభించింది. దీంతో సీఐడీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో నేడో, రేపో ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-39-183739.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.