ఏపీ మద్యం టెండర్ల కేసు.. పీటీ వారెంట్‌ను తిరస్కరించిన కోర్టు.!

Publish Date:Aug 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల అవకతవకల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఏసీబీ కోర్టులో  చుక్కెదురైంది. ఈ  కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలపై సిట్ అధికారులు దాఖలు చేసిన  పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు  తిరస్కరించి వెనక్కి పంపింది. మద్యం రవాణా టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సిట్ అధికారులు దర్యాప్తువేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలతో పాటు కారుమూరి సునీల్‌ను కూడా సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు.

అయితే..  అంతకంటే ముందు ఇదే వ్యవహారానికి సంబంధించిన నగదు అక్రమ చలామణి ఆరోపణలపై  ఈడీ అధికారులు వీరిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలులో ఉన్న నిందితులను విచారణ నిమిత్తం తమ అధీనంలోకి తీసుకునేందుకు గతంలో సిట్ అధికారులు పీటీ వారెంట్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

అయితే..  సిట్   రిమాండ్   చెల్లదంటూ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలు     హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, నిందితులకు అనుకూలంగా తీర్పునిస్తూ వారి రిమాండ్‌ను రద్దు చేసింది. అయినప్పటికీ..  కేసు విచారణలో భాగంగా  రెండు రోజుల కిందట సిట్ అధికారులు మళ్లీ ను విజయవాడ ఏసీబీ కోర్టులో  పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. దాఖలైన కొత్త పీటీ వారెంట్‌లోని చట్టపరమైన అంశాలను, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమగ్రంగా పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయస్థానం, ఈ వారెంట్‌ను తోసిపుచ్చుతూ వెనక్కు పంపింది. 

మరోవైపు, ఇదే మద్యం టెండర్ల  కేసులో  నిందితులుగా ఉన్న కె. ధనుంజయ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు బుధవారం (ఆగస్టు 19)   విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట   హాజరయ్యారు. వారి హాజరును పరిశీలించిన జ్యుడీషియల్ అధికారి ఎల్. తేజోవతి  దర్యాప్తు సంస్థల నుంచి అధికారికంగా సమన్లు అందిన తర్వాతే కోర్టు విచారణకు హాజరు కావాలని, అప్పటివరకు వేచి చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.  

ap liquor case, sit pt warrant, acb court vijayawada, kasireddy rajasekhar reddy, donthireddy vasudeva reddy, liquor tender scam ap 

By
en-us Political News

  
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.