సోము వీర్రాజుతో జనసేన పరేషాన్! ఇక  బీజేపీతో తెగతెంపులేనా ?  

Publish Date:Feb 5, 2021

Advertisement

బీజేపీతో పొత్తుపై జనసేన యూ టర్న్ తీసుకోనుందా? సోము వీర్రాజుతో పవన్ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారా ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తోంది జనసేన. అయితే బీజేపీ తీరుతో జనసేన నేతలు మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపించింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేస్తున్న ప్రకటనలపై పవన్ పార్టీ నేతలు అసహనంగా ఉంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా... ఆయన ఏకపక్ష ప్రకటనలు చేస్తున్నారని కొందరు జనసేన నేతల బహిరంగంగానే విమర్శించారు. 

 జనసేన నేతలు ఎంతగా మొత్తుకుంటున్నా తన తీరు మార్చుకోవడం లేదు సోము వీర్రాజు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఏపీలో సంచలనంగా మారగా.. బీజేపీ-జనసేన కూటమిలో మాత్రం సెగలు రేపుతోంది. తమ కూటమి గద్దెనెక్కితే బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు జనసేనలో మంట పుట్టిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి వంటి అత్యంత కీలకమైన అంశంలో సోము వీర్రాజు అలా ఎలా ప్రకటన చేస్తారని జనసేన నేతలు భగ్గుమంటున్నారు. కూటమి తరపున ప్రకటించారా లేక బీజేపీ తరపున ప్రకటించారో చెప్పాలంటున్నారు. అతి పెద్ద జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి  అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు తమకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయని జనసేన నేతలు ఆక్షేపిస్తున్నారు. 
 
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. జిల్లాల వారిగా పర్యటిస్తూ కేడర్ ను బలోపేతం చేస్తున్నారు. జగన్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నప్పుడు... అధికారంలోకి రాగానే తీరుస్తామని వారికి భరోసా ఇస్తున్నారు గబ్బర్ సింగ్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమ నాయకుడు పవన్‌ ముఖ్యమంత్రి అవ్వాలన్నది జనసేన కార్యకర్తల  అభిమతం. కాని ఇప్పుడు సోము వీర్రాజు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో .. పవన్ పార్టీ కార్యకర్తలు మండిపోతున్నారు. కూటమి తరపున బీసీ వ్యక్తి సీఎం అయితే.. తమ నాయకుడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీర్రాజు వ్యాఖ్యలు తమలో గందరగోళాన్ని రేకెత్తించేలా ఉన్నాయని జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే దిగుతారని వీర్రాజు గతంలో చేసిన ప్రకటన రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమైంది. రెండు పార్టీల నేతలు అభ్యర్థి విషయంపై పోటాపోటీ ప్రకటనలు చేయడంతో పొత్తు ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే బీజేపీ పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. తిరుపతి పోటీ విషయంలో బీజేపీ పెద్దలతో పవన్ ఓ డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తిరుపతిలో బీజేపీ బరిలో ఉంటే.. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కమలం పెద్దల ముందు ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో  సోము వీర్రాజు చేసిన బీసీ ముఖ్యమంత్రి ప్రకటన.. జనసేనలో ప్రకంపనలే రేపుతోంది. 

 ఇప్పుడు బీసీలను కాదనలేం.. పవన్‌ను వద్దనలేం.. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్‌ ఇప్పటికీ దళిత సీఎం వ్యాఖ్యల విషయంలో అక్కడి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. బీసీలపై ఆయనకు నిజంగా అంత ప్రేమ ఉంటే గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవుల్లో ఒకటి బీసీలకు ఎందుకు ఇప్పించలేకపోయారు’ అని జన సేన నేతలు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు రెండు పార్టీల పొత్తుపైనే ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.