Publish Date:Apr 19, 2022
కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా సజావుగా సాగడానికి కుటుంబ పెద్ద తన ఆదాయానికి అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా వ్యయం చేస్తాడు. కుటుంబ సంక్షేమంతో పాటు ఒక స్థాయి పెరిగేందుకు అవసరమైన విధంగా పొదుపుగా సొమ్మును వినియోగిస్తాడు. అందుకు భిన్నంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా వచ్చినది వచ్చినట్లు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఒక ప్రభుత్వాధినేత కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి తాను పాలిస్తున్న రాష్ట్రం లేదా దేశాన్ని ప్రజా సంక్షేమాన్ని విస్మరంచకుండ ప్రగతి బాట విడవ కుండా ఆదాయ వనరులను ప్రణాళికా బద్ధంగా వ్యయం చేయాలి.
అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందన్నదానికి ప్రస్తుత శ్రీలంక పరిస్థితి అద్దం పడుతుంది. అయితే ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండా అతి వేగంగా సంక్షోభంలోనికి కూరుకు పోతున్న రాష్ట్రాలు మన దేశంలో కూడా ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ టాప్ ఫైవ్ లో ఉందని ‘ది ప్రింట్’ వెబ్ సైట్ కథనం పేర్కొంది. ఉచిత పందేరాలు, ఆదాయ వనరులు, రాబడి మార్గాలను విస్మరించడం వంట చర్యలతో ఏపీ అతి వేగంగా ఆర్థిక సంక్షోభంలోనికి కూరుకు పోతున్నదనీ, ఉద్యోగులకు సమయనికి జీతాలు అందించలేక ఇప్పటికే సతమతమౌతూ, అన్నిటిపైనా కోతల వాతలు వేస్తూ సంక్షేమం పేరిట ఉచితల పందేరంపైనే దృష్టి పెడుతున్న ఫలితమే ఇదని ఆ వెబ్ సైట్ పేర్కొంది.
ఒక రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో బేరీజు వేయడానికి ఏటా రాబడుల్లో పెరుగుదలను పరిశీలిస్తే సరిపోతుంది. ఆ కోవన ఏపీ పరిస్థితిని తీసుకుంటే గత మూడేళ్లలో రాష్ట్ర రాబడిలో పెరుగుదల కంటే తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులలో పెరుగుదలే అధికంగా ఉంది. దీనిని బట్టే అర్థమౌతుంది ఏపీ అక్షర క్రమంలోనే కాదు ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంలో కూడా అగ్ర స్థానంలోనే ఉందని. ఏపీ ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘనల స్థాయి అతి తీవ్రంగా ఉందని కాగ్ నివేదిక కూడా స్ఫష్టం చేసీన విషయం విదితమే.
ఒక విధంగా చెప్పాలంటే జగన్ సర్కార్ తీరు ఆర్థిక ఉగ్రవాదాన్ని స్ఫురింప చేస్తున్నది. విపత్తు నిర్వహణ నిధులు, పంచాయతీ నిధులు, ఇలా ఎక్కడ నిధులు ఉంటే అక్కడ నుంచి వాటిని సంక్షేమం పేరట ప్రవేశ పెట్టిన ఉచితాలకు మళ్లించేశారు. అంతే కాకుండా రుణాలను తిరిగి చెల్లించేందుకు ప్రణాళికలే లేకుండా అందిన కాడికి అప్పులు తీసుకు వచ్చేస్తున్న ఏపీలో శ్రీలంక వంటి పరిస్థితిలు ఏర్పడటానికి ఎంతో కాలం పట్టదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని అరికట్టేందుకు కేంద్రం కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాలి, లేదా రాష్ట్రంలో ఎకనామిక్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-in-the-way-of-jagan-with-jagan-econamic-terrorism-39-134634.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.