Publish Date:Aug 30, 2022
ఎవరూ కోర్టు, ఆస్పత్రి మెట్లు ఎక్కకూడదనే అనుకుంటారు. కోర్టు మెట్లెక్కితే పేరంటానికి పిలిచినట్టు విచా రణకు పిలుస్తూనే ఉంటారు. దానికి సమయం, సందర్భం అన్నీ కోర్టు చేతిలోనే ఉంటాయి. కోర్టు పక్షులు కొందరు ఉంటారు. జీవితాంతం ఏదో ఒక కేసులో కోర్టుకు వెళుతూంటారు, అనేక ప్రాంతాల్లో కూడా కోర్టుల పిలుపులు వస్తూంటాయి. కొన్ని కేసుల్లో మొట్టికాయలు పడుతూంటాయి. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పరిస్థి తి ఇదే. ఇప్పటికే హైకోర్టు చేతిలో హెచ్చరికల దెబ్బలు తిన్నారు. ఇపుడు తాజాగా కొవ్వూరు బ్యాంక్ ఎన్ని కల కేసులో మళ్లీ మరో దెబ్బ తిన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల వ్యవహారం రచ్చకెక్కడం తెలిసిం దే. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం సంబంధించినవారు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కానీ అది సహించలేక వైసీపీ వర్గాలు అసలా ఎన్నికలు సరిగా జరగలేదని గోల చేసి రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయానికి టీడీపీ మండిపడింది. ఎన్నిక ఏకగ్రీవం అయిన తర్వాత అవి సక్రమంగా జరగలేదని వైసీపీ గొడవచేయడమే వారికి సంబంధించినవారు ఎంపిక కాలేదన్న కోపంతోనే ఎన్నికను రద్దుచేయడానికి నిర్ణయం తీసుకుం ది. అంటే ఏ ఎన్నికయినా వైసీపీవారికే అనుకూలించాలన్నపట్టుదల ఆ పార్టీవారు ప్రదర్శించడం అర్ధం లేనిది. ఏక గ్రీవం ఎందుకు అయిందీ తెలిసినా అది వైసీపీ సహించలేకపోతోంది. కోర్టు తీర్పు పట్ల కూడా వైసీపీ నాయకత్వానికి గౌరవం లేకపోవడం వారి తీరుకు అద్దంపడుతోంది.
ఎన్నికలు రద్దు చేసి, పాలకవర్గానికి బదులు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారని టీడీపీ వర్గీయులు మండి పడ్డారు. ఈ వ్యవ హారం హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్నికలు రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని విమర్శించారు.
కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపారు. హైకోర్టు ఇచ్చి న తీర్పు జగన్ కు చెంప పెట్టు వంటిదని బాబు అన్నారు. బ్యాంకు పాలకవర్గం స్థానంలో ప్రభు త్వం త్రిసభ్య కమిటీ తెచ్చిందని, త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని చంద్ర బాబు వివరించారు.
అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారని ఆరోపించారు. న్యాయంగా జరిగిన ఎన్నికలను ఒప్పు కునేందుకు సీఎం సిద్ధంగా లేరని విమర్శించారు. న్యాయవ్యవస్థ ఒకటుందని జగన్ గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు. ఇప్పటికైనా చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచిం చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-highcourt-is-hm-to-jagan-25-142965.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.