2019 ఓటర్ల జాబితానే ఫైనల్ ! ఎస్ఈసీని సమర్ధించిన హైకోర్టు 

Publish Date:Feb 4, 2021

Advertisement

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న మరో నిర్ణయాన్ని హైకోర్టు సమర్దించింది. పంచాయతీ ఎన్నికలకు 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితానే ఫైనల్ అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 2019 ఓటర్ల జాబితా అంశంపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది. ఏపీలో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడంతో... 2019 ఓటర్ల జాబితా అధారంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎస్ఈసీ. దీంతో  3.6 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2021 జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్‌ కోరారు. పిటిషనర్‌ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. 

ఎన్నికల ఏర్పాట్లలో జిల్లాలో పర్యటిస్తున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గురువారం  నెల్లూరు జిల్లా అధికారులతో ఆయన  సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులు, భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిమ్మగడ్డ.. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ను గౌరవించకపోయినా ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. గౌరవాలకు, భేషజాలకు పోవాల్సిన అవసరంలేదన్నారు. సుప్రీం కోర్టు సూచన మేరకు తాను ఎన్నికలు నిర్వహిస్తున్నానని,  తన విధులను తాను బాధ్యతగా నిర్వహిస్తానని తెలిపారు.  రాష్ట్రంలో కరోనా అదుపులోకి రావడం సంతోషమన్నారు నిమ్మగడ్డ. ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయమని, ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు.  తెలంగాణలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు. 

By
en-us Political News

  
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.