ఏమి సెప్తిరి.. ఏమి సెప్తిరి..  సజ్జల సారూ

Publish Date:Feb 2, 2022

Advertisement

వెనకటికో పెద్ద మనిషి,ఎడమ చేయి తీసి పుర్రచేయి పెట్టమన్నారుట. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ. ‘ఆల్ ఇన్ వన్’  సలహాదారు, సజ్జల రామకృష్ణా రెడ్డి మేథోసంపత్తి కూడా అలాగే వుంది. ఒకసారి ఇచ్చిన జీతాలను వెనక్కి తీసుకోరాదని, అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి నెల జీతాల్లో రికవరీ లేకుండా జీతాలు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

అయితే, ప్రభుత్వం అర్థరాత్రి ప్రకటించిన ఈ పీఆర్సీని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపున కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌’పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేయాలనే పీఆర్సీ ప్రతిపాదన చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఇచ్చిన జీతాలను రికవరీ చేయడం న్యాయసూత్రాలకు విరుద్ధమని ఏ ఒక్కరి నుంచి కూడా రికవరీ చేయవద్దని ఆదేశించింది. పీఆర్సీలో ప్రభుత్వం 23 శాతంగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది.  అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) రూపంలో ఉద్యోగులు తీసుకున్నారు.   ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు తోసి పుచ్చింది.

అయితే సకల సలహా వల్లభుడు సజ్జల రామ కృష్ణా రెడ్డి, తమ మేథోశక్తి మొత్తాన్ని, వినియోగించి, అసలు ‘రికవరీ’ అనేదే పీఆర్సీ పత్రాల్లో లేదని మెలిక పెట్టారు. ఎవరి దగ్గరా జీతాలు రికవరీ చేయడం లేదన్నారు. అయితే... అంతలోనే అసలు గుట్టు విప్పారు. రికవరీ అనే పదం లేదు కానీ, ‘రీఅడ్జస్ట్’ నే పదం ఉందని, ఇప్పుడు చేస్తున్నది కూడా ‘రీఅడ్జస్ట్’ మెంటే కానీ, రికవరీ కాదని, ఉద్యోగులకు జ్ఞానబోధ చేశారు. ఐఆర్ అంటే మధ్యంతర భృతి అనేది తాత్కాలిక అడ్జస్ట్ మెంట్ అని ఇప్పుడు రీఅడ్జస్ట్ మెంట్ చేస్తున్నాం కానీ రికవరీ కాదు అన్నారు. 

అయితే ఉద్యోగులు మాత్రం, ఏ రాయి అయితేనేం పళ్ళు ఊడకొట్టటానికి అంటున్నారు. రికవరీనా.. రీ అడ్జస్ట్ మెంటా అన్నది కాదు .. ఇచ్చిన జీతాలు వెనక్కి తీసుకుంటున్నారా లేదా అన్నదే ముఖ్యమని ఉద్యోగులు అంటున్నారు. పేరేది పెట్టినా ఇచ్చిన జీతాలను వెనక్కి తీసుకోవడమే సహజ న్యాయ విరుద్ధమని, న్యాయ స్థానం చెప్పింది కూడా అదేనని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.అయితే, ఏదో విధంగా ఐదు డీఏ బకాయిలు మొత్తం, ఐఆర్ రికవరీతో ‘రీఅడ్జస్ట్’ చేసుకోవాలనేదే సర్కార్ సంకల్పం అనేది  సజ్జల చెప్పకనే చెప్పారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకులు  ఏమి చేస్తారో చూడాల్సి ఉందని అంటున్నారు.

 

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.