వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు... జగన్ సర్కార్ కు హిందూ పండుగలపైనే వివక్షా?

Publish Date:Sep 5, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వివాదం ముదురుతోంది. జగన్ సర్కార్ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని ప్రభుత్వం తెలిపింది. ఎవరికి వారు ఇళ్లల్లోనే జరుపుకోవాలని స్పష్టం చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు కూడా ఏపీ సర్కార్ ప్రకటించింది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

వినాయకుడి ఉత్సవాలకు మాత్రం కొవిడ్ పేరు చెప్పి ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం.. ఇతర విషయాల్లో ఏం జాగ్రత్తలు పాటిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆలయాల్లో భక్తుల సందర్శనలు ఆగడం లేదు, చర్చిల్లో ఆదివారం ప్రార్థనలు ఆగడం లేదు. జగన్ సర్కార్ తీరుపై హిందూ సంఘాలు, బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. హిందూ పండుగలపై వివక్ష చూపుతున్నారని, కావాలనే కొవిడ్ పేరుతో ఆంక్షలు విధించారని ఆరోపిస్తున్నాయి. కొవిడ్ కారణంగా వినాయక చవితి వేడుకలకు ఇండ్లలో జరుపుకోవాలని చెబుతున్న జగన్ ప్రభుత్వం.. ఇతర వర్గాల పండుగలకు ఎందుకు అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవలే మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారని, పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గుడ్ ఫ్రైడే రోజున వందలాది మంది ఒకే చోట గుమిగూడి వేడుకలు చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని ఇబ్బందులు వినాయక చవితి పండుగగే ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు సెప్టెంబర్ 2న దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఊరువాడా నిర్వహించారు. సభలు, సమావేశాలు పెట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా తీశారు. వర్దంతి జరుపుకోవడానికి లేని అంక్షలు హిందూ పండుగైన వినాయక చవితిపైనే ఎందుకనే బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఏపీలో స్కూళ్లను కూడా ఓపెన్ చేశారు. విద్యార్థుల హాజరు కూడా బాగానే ఉంది. నిజానికి థర్డ్ వేవ్ వస్తుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో స్కూళ్లు ఇప్పుడే తెరవద్దని జనాలు కోరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేశారు. కాని జగన్ సర్కార్ మాత్రం మొండిగా ముందుకు వెళ్లింది. విద్యాసంస్థలను తెరిచింది. స్కూల్స్ తెరిచాకా కరోనా కేసులు కూడా నమోదవుతున్నాయి. స్కూల్స్ తెరిచినప్పుడు.. వినాయక చవితిపైనే ఎందుకు ఆంక్షలు విధించారన్నది హిందూ సంఘాల ప్రశ్న, 

ఏపీ సర్కార్ తీరును బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వినాయక చవితి వేడుకలపై విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు వ్యాక్సిన్‌ వేస్తూ, మరోవైపు కరోనా తగ్గిందని చెబుతున్న ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వ ఆంక్షలపై ఏకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు సోము వీర్రాజు. ఇడుపులపాయలో లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకని ప్రశ్నించారు బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి. జగన్ ప్రభుత్వంపై ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు.హైదరాబాద్ తర్వాత కర్నూల్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు కర్నూల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు.  కరోనా పేరుతో వినాయక భక్తుల పై ఆంక్షలు సరికాదని, ఉత్సవాలకు నిమజ్జన ఊరేగింపు లకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.  

మరోవైపు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కొవిడ్ నేపథ్యంలో జనం గుమికూడకుండా, ప్రమాదం పొడసూపకుండా జాగ్రత్తలు తీసుకోవడం వేరు. కానీ.. అసలు చవితి ఉత్సవాలను నిర్వహించే అవకాశమే లేకుండా ఆంక్షలను విధించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  వినాయక చవితి అంటే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే అరుదైన పండుగ. ఏ కాలనీలో జరిగే ఉత్సవాల్లో అయినా హిందువులతో పాటు, ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూనే ఉంటారు. ఒక పందిరి వేసి వినాయకుడిని ప్రతిష్టించి జనం లేకుండా అయినా సరే.. పూజలు చేసి వేడుక చేసుకోవడం ప్రతిచోటా ప్రజలకు ఒక సెంటిమెంట్ గా మారిపోయిన విషయం. అలాంటిది పూర్తి నిషేధం అనేది ప్రజలకు బాధగా ఉంది. వినాయకచవితి ఉత్సవాలు నిర్వహిస్తే.. పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటుచేసే పందిర్ల వద్ద వాలంటీర్లు, పోలీసులతో నియంత్రణకు కొన్ని ఏర్పాట్లు చేస్తే జనం ఎక్కువ రాకుండా చేయడం చాలా చిన్న పని. అలాంటి జాగ్రత్తలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆలోచించకుండా.. ఏకంగా ఉత్సావాలనే రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయించడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.