ఏపీ ప్రజలపై జగన్ పవర్ బాంబ్.. 8 నెలల్లో 36 వందల కోట్లు టార్గెట్ 

Publish Date:Sep 7, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాకుల మీదు షాకులు ఇస్తోంది జగన్ రెడ్డి సర్కార్. ఇటీవలే ఆస్తి పన్ను పెంచింది. చెత్త పన్నును భారీగా వసూల్ చేస్తోంది. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలకు పెంచిన పన్నులు భారంగా కాగా.. మరో భారం వేయడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం. పవర్ బాంబ్ పేల్చడానికి కసరత్తు చేస్తోంది. విద్యుత్ సంస్ధలు నష్టపోయిన మొత్తాల్ని వినియోగదారుల్ని అదనపు ఛార్జీల రూపంలో పిండి మరీ వసూల్ చేయాడనికి ప్రణాళికలు రచించింది. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే 8 నెలల పాటు ఏపీలో కరెంటు బిల్లుల మోత మోగబోతోంది. డిస్కంల వారీగా బిల్లుల మోతలో తేడాలు కూడా ఉండబోతున్నాయి

2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్ధిక సంవత్సరం వరకూ అంటే ఆ ఐదేళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి అయిన ఖర్చు సరఫరాకు అయిన ఖర్చుకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని నష్టాల రూపంలో ప్రజలపై రుద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీటిని ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూల్ చేయబోతోంది. దీని ప్రకారం అప్పుడు తలెత్తిన నష్టాల్ని ఇప్పుడు వాడకం ఆధారంగా వినియోగదారుల నుంచి సర్దుబాటు రూపంలో వసూలు చేస్తారు. గతంలో జరిగిన నష్టాన్ని 10 శాతానికి పైగా వడ్డీతో కలిపి మరీ డిస్కంలు వినియోగదారులపై వేయబోతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్ధ తూర్పు ప్రాంత విద్యుత్ సరఫరా సంస్ధ ఉన్నాయి. ఈ రెండు డిస్కంల పరిధిలో రెండు వేర్వేలు ఛార్జీలు విధించబోతున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో యూనిట్ కు రూ.1.27 చొప్పున.. ఈపీడీసీఎల్ పరిధిలో  యూనిట్ కు రూ.0.45 చొప్పున అదనపు ఛార్జీలు విధించబోతున్నారు.

గతంలో ఆయా విద్యుత్ పంపిణీ సంస్ధలు చవిచూసిన నష్టాల ఆధారంగా ఈ ఛార్జీల లెక్కింపు చేపడుతున్నారు. ఆయా డిస్కంల పరిధిలో ఉన్న వినియోగదారులకు వీటి ఆధారంగానే అదనపు ఛార్జీలు పడతాయి. ఇప్పటివరకూ తాము వాడుతున్న బిల్లుల మొత్తాన్నే చెల్లించే వినియోగదారులు.. సెప్టెంబర్ నుంచి తాము వాడని మొత్తాన్ని సైతం అదనపు ఛార్జీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 8 నెలల పాటు వీటి వడ్డన ఉంటుంది. ఇందులో ప్రస్తుతం 200 యూనిట్లు వాడుతున్న ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుడు కొత్త బిల్లుల్లో దాదాపు రూ.250 మేర అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులపై అయితే రూ.90 మేర అదనపు ఛార్జీల భారం పడుతుంది. ఈ లెక్కన వచ్చే 8 నెలల్లో రూ.3600 కోట్ల రూపాయల భారం వినియోగదారులపై మోపేందుకు విద్యుత్ సంస్ధలు సిద్ధమయ్యాయి.

వాస్తవానికి ఏపీలో డిస్కంలు గతంలో ఐదేళ్ల పాటు తమకు కలిగిన నష్టాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ప్రతిపాదించిన అదనపు ఛార్జీలు రూ.7200 కోట్లు. కానీ ఈఆర్సీ మాత్రం రూ.3600 కోట్ల వసూళ్లకు మాత్రమే అనుమతిచ్చింది అంటే మొత్తం ఛార్జీలు ఇప్పుడే వసూలు చేయబోరన్న మాట. మొత్తం ఛార్జీలు ఒకేసారి వసూలు చేయడం మొదలుపెడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు కాబట్టి ఇప్పుడు సగం ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ఆ తర్వాత మిగతా ఛార్జీలు మరోసారి వడ్డిస్తారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ మరో సగం ఛార్జీల వడ్డన తప్పదని తేలిపోయింది. జగన్ సర్కార్ పన్నుల మోతపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.