నెల గడిచినా అందని అధికారం.. ఏపీలో సర్పంచుల ఆగ్రహం

Publish Date:Mar 24, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కొత్త సర్పంచులు గెలిచారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు రోడ్డున పడి ఏడుస్తుంటే.. గెలిచిన వారు ఇంట్లో కూర్చొని ఏడవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. నెల రోజులు క్రిందట ఎన్నికైన సర్పంచులు.. తమకు ఇంకా అధికారం రాకపోవడంతో కుమిలి పోతున్నారు. ప్రభుత్వం కరుణ కోసం పడిగాపులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నెల రోజులు గడిచినా నేటి వరకు పాలకవర్గాలకు అధికారాలు, బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో నేటికీ గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. 

సర్పంచుల అధికారికంగా ప్రమాణ స్వీకారం తేదీని నిర్ణయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఆయా సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అంతవరకు సర్పంచ్ హోదా ఉండదు. పంచాయతీకి సంబంధించి ఎటువంటి అధికారాలు సర్పంచ్ గా ఉండవు. ఆర్థిక సంవత్సరం ముగింపులో భాగంగా మార్చి నెలాఖరు కావడంతో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చుచేసి తమకు బాధ్యతలు అప్పగించే నాటికి పంచాయతీల్లో ఖాళీ ఖజానా ను ప్రత్యేక అధికారులు అప్పగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని నూతనంగా ఎన్నికైన సర్పంచులు వాపోతున్నారు. 

2013 లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే సర్పంచులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాని ఈసారి నెల రోజులు గడిచిన ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం సర్పంచులు బాధ్యతలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తారని సమాచారం.ఎన్నికలు జరిగి, ఫలితాలు ప్రకటించిన తేదీతో సంబంధం లేకుండా, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి సర్పంచులు, వార్డు సభ్యులకు ఐదేళ్లపాటు పదవీకాలం ఉంటుంది. పంచాయతీల్లో సచివాలయ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలన్నా, నిధులను డ్రా చేయాలన్నా సర్పంచ్ లకు చెక్ పవర్ ఉంటుంది. అధికారికంగా జీవో జారీ చేసినా నాటి నుంచి మాత్రమే సర్పంచ్ గా అన్ని రకాల అధికారాలు లభిస్తాయి. 

సర్పంచుల బాధ్యతలకు సంబంధించి కొన్ని మార్పులు ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఏప్రిల్ లోగానీ వీరు బాధ్యతలు చేపట్టే అవకాశలు లేవని అంటున్నారు. ఈ నెలాఖరుకు 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోనున్నాయి. వీటిని ప్రత్యేక అధికారుల చేత ఖర్చు పెట్టించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతు న్నారు. ఈ నెలాఖరు వరకు పంచాయతీ ప్రత్యేకాధికారుల ఏలుబడే కొనసాగే పరిస్థితి ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు మంజూర య్యి నిధులు, విధులపై సర్వహక్కులు పాలక వర్గాలకే ఉంటాయి. ప్రత్యేకాధికా రులు నిధుల దుర్వినియోగం, మళ్లింపు, ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతోపాటు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు. 

మరోవైపు అధికారికంగా ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టని విషయం చాలామంది జనాలకు తెలియదు. దీంతో తాగునీ టి సమస్యను పరిష్కరించాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలంటూ ప్రజలు ఒత్తిడి తీసుకువస్తున్నారని పలువురు సర్పంచులు వాపోతున్నారు. జగన్ రెడ్డి సర్కార్ తీరుతో గెలిచినా ఆనందం లేకుండా పోయిందని, ఖజానా అంతా ఖాళీ చేసి ఇస్తే తర్వాత తాము చేయడానికి కూడా నిధులు ఉండవలే ఆందోళన సర్పంచుల్లో వ్యక్తమవుతోంది. 
 

By
en-us Political News

  
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.