Publish Date:Feb 13, 2020
ఉగాది రోజున పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ సర్కార్.. విశాఖపట్నంలో భారీగా భూసమీకరణ జరుపుతోంది. ప్రభుత్వం జరిపే ఈ ప్రయత్నాలకు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అయితే ఎక్కడైనా భూములను సమీకరించినా వాటిని పేదలకు పంపిణీ చేయాలంటే ముందుగా ఆ భూముల్లో లేఔట్ లు వేయాలి. భూమిని చదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఆ తర్వాత ఆయా స్థలాలను ఫ్లాట్టుగా విభజించి పంపిణీ చేయాలి. ఈ పనులను పూర్తి చేయటానికి సగటున ఎకరాకు 40 లక్షల రూపాయల అవుతుందని విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ఉన్నతాధికారులకు వెల్లడిస్తున్నారు. ఈ మధ్య పెరిగిన వ్యయాలు ఈ సేవలకు జీఎస్టీని కూడా కలుపుకుంటే ఎకరాకు 52 లక్షలు అవుతుందని లెక్కకట్టి తేల్చేశారు. సమీకరించ దలచిన 6,000 ల పైచిలుకు ఎకరాలలో ఈ విధంగా లేఔట్ లు వేయాలి అంటే సుమారు 3,000 ల కోట్లు అవసరమని లెక్కకట్టారు.
అయితే అంత మొత్తంలో తాము సమీకరించలేమని వీఎంఆర్డీఏ అధికారులు చేతులెత్తేశారు. దీంతో వారికి ఆ విషయంపై బోధపడేలా మార్గదర్శకాలిచ్చారు. ఇతర వ్యాపార లేఔట్ ఉన్న అంత వ్యయం పెట్టనక్కర్లేదని నామమాత్రపు లేఔట్ వేస్తే చాలని సూచించారు. దాంతో అధికారులూ కిందా మీదా పడి ఆ వ్యయాన్ని 52 లక్షల నుంచి ఏకంగా 2.5 లక్షల రూపాయలకు తగ్గించారు. అదేవిధంగా వీఎంఆర్డీఏ పై పడే భారం 150 కోట్లన్నమాట. ఎకరా స్థలంలో 2.5 లక్షల రూపాయలతో మౌలిక వసతులు ఎలా సమకూరుతాయని ప్రశ్నిస్తే భూమిని చదును చేసి ట్రెంచ్ లు కొట్టి మార్కింగ్ వేస్తే చాలని అంతకు మించి ఏమీ అవసరం లేదని కూడా అంటున్నారు. మరి రోడ్లు వేయిస్తామని.. కాలువల కోసం చిన్న గోతులు తవ్వుతామని కూడా చెప్తున్నారు. ఇతర లేఅవుట్ ఉన్న తారు రోడ్లు, విద్యుత్ సదుపాయం వంటివి ప్రస్తుతానికి ఉండవని పరోక్షంగా వెల్లడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆ సంస్థలో అన్ని నిధులు ఉన్నాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-govt-new-strategy-on-houses-for-poor-people-25-94229.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.