ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల, దాళవాయి రమాదేవి?

Publish Date:Aug 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
శాసనమండలి ప్రాతినిధ్యంలో భాగంగా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం  పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య,  రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ సామాజిక వర్గ మహిళా నాయకురాలు, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

 దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉంటూ, క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో సైతం విధానపరమైన అంశాలపై గళం విప్పిన వర్ల రామయ్య సేవలకు తగిన గుర్తింపునిచ్చేందుకు వర్ల రామయ్య, అలాగే  ప్రజా సమస్యలపై పోరాడుతూ స్థానిక స్థాయిలో బలమైన ముద్ర వేసిన మహిళకు అవకాశం కల్పించచాలన్న ఉద్దేశంతో దళవాయి రమాదేవిని చంద్రబాబు ఎంపిక చేశారని అంటున్నారు.  వీరి అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.   

AP Governor Quota MLC, Varla Ramaiah, Dalavai Ramadevi, TDP MLC Candidates, AP Legislative Council, CBN, APpolitics, TeluguOne

By
en-us Political News

  
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.