Publish Date:Nov 13, 2024
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు ఐదు కీలక బిల్లులను తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రవేశ పెట్టనుంది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రులు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఆ తరువాత సభలో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అనంతరం సభలో ఐదు కీలక బిల్లలను ప్రవేశ పెట్టనుంది. అవి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు, మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు, ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ల బిల్లు, అలాగే ఎన్టీఆర్ హెల్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు.
అంతే కాకుండా గురువారం (నవంబర్ 14) మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక లాంఛనమే కానుంది. రఘురామకృష్ణం రాజును డిప్యూటీ స్పీకర్ గా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలపై మంత్రులు సభలో ప్రకటన చేయనున్నారు. వీటిలో ఏపీ ఎమ్ఎస్ఎమ్ఇ అభివృద్ధి పాలసీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలెప్ మెంట్ పాలసీ, ఆంధ్ ప్రదేశ్ ఫుడ్ ప్రాసేసింగ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 - 29.పై మంత్రి టీజీ భరత్ స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-government-to-present-five-key-bills-in-assembly-25-188345.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.