ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. వైసీసీ హయాంలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం కోటరీకే పరిమితమై దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమైన జగన్.. అధికార పగ్గాలు చేపట్టగానే, ప్రజలకు చేరువయ్యే అన్ని మార్గాలనూ మూసేసుకున్నారు. కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఈ ప్రజాబాటలో భాగంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నాయి. జూన్ 9న సంక్షేమ పథకాలపై కేంద్రీకరిస్తూ భారీ ఎత్తున తొలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరు, అందులో మార్పుల వంటి పలు అంశాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత జూన్ 12న అమరావతి వేదికగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పాలనాపరమైన ఇబ్బందులు, ప్రజల సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఇక జూన్ 15న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై స్థానిక ప్రజలు, మేధావుల నుండి నేరుగా సూచనలు, సలహాలు సేకరించనున్నారు.
వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న జగన్ ప్రజలతో నేరుగా కలిసే అవకాశాలకు తాళం వేసేశారు. ప్రజల నుండి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకోకపోవడంతోనే 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఎన్డీఏ కూటమి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజలతో మమేకం అయ్యే వ్యూహాలనే అనుసరిస్తున్నది. తాజాగా చేపట్టిన ప్రజాబాట. ద్వారా సామాన్య ప్రజలు తమ ప్రాంత ప్రతినిధులను, ప్రభుత్వాన్ని నేరుగా కలిసి అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ప్రభుత్వం భవిష్యత్తులో తన పరిపాలనను మరింత మెరుగుపరుచుకుంటూ, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని తెలుగుదేశం కూటమి సర్కరా్ భావిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-government-to-launch--peoples-outreach-programmee-25-222151.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్