మళ్ళీ మూడు.. అసెంబ్లీలో బిల్లు ?

Publish Date:Sep 2, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న మూడు రాజధానుల బిల్లును మళ్ళీ తెస్తుందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ మానస పుత్రికకు మళ్ళీ ప్రాణం పోయాలని అనుకుంటున్నారా? అంటే, అధికార వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. గత సంవత్సరం (2021) నవంబర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది.

ఇందుకు సమబందించి  దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర  అడ్వకేట్ జనరల్, ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పాత బిల్లును ఉపసంహరించుకుంటూ తెచ్చిన కొత్త బిల్లును సభ ఆమోదం తెలిపింది. అయితే, అప్పుడే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, సాంకేతికంగా బిల్లును వెనక్కి తీసుకున్నా, మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంతే కాదు, ఉపసంహరించుకున్న బిల్లు స్థానంలో మరింత పక్కా బిల్లును త్వరలోనే తీసుకొస్తామని ప్రకటించారు.

ఇదంతా చరిత్ర, అయితే ఇప్పడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈ నెల మూడవ వారంలో మొదలయ్యే, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో  మూడు రాజధానుల బిల్లును మళ్ళీ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంతవరకు అధికారికంగా అసెంబ్లీ సమావేశాల  తేదీలు ఖరారు కాలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ నెల మూడవ వారంలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నెల 7న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీల పై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలాగే,ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులతో పాటుగా, మరోసారి మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. 

కాగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని మొదటి సారిగా 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందకపోవడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీనిపై రాజధాని రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆందోళన  చేపట్టారు ఈ రోజుకు కూడా అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూనే వుంది. ఎండా వానలు, ప్రకృతి వైపరీత్యాలతో  పాటుగా కొవిడ్ మహమ్మారిని కూడా తట్టుకుని అమరావతి రైతులు, మహిళలు విభిన్న రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరున అమరావతి రైతులు చారిత్రక పాదయాత్ర నిర్వహించారు. కాగా, సెప్టెంబర్ 12వ తేదీకి ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తిఅవుతున నేపధ్యంలో అదే రోజు నుంచి మరోసారి రైతులు, మహిళలు మరో మహా పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ సారి అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా సూర్యభగవానుడు కొలువైన అరసవల్లి వరకు అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు పేరున మరో మహా పాదయత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 
మరో వంక  తెలుగు దేశం, బీజేపీ సహా ప్రతిపక్ష పార్టీలు అన్నీ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాలుపంచుకున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొండిగా ముందుకు పోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల చివర్లో జరిగే  అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో  ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లు విషయంలో ఇటు ప్రజల్లో అతి పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠను రేపుతోంది.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.