39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు పచ్చజెండా!

Publish Date:Apr 7, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంగళవారం (ఏప్రిల్ 7) జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో  రూ. 39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 11 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  

ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన  16వ ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పి. నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా నిరుద్యోగితను తగ్గించడమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ, విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఈ పెట్టుబడులు ప్రధానంగా రానున్నాయి.

రాజధాని ప్రాంతమైన అమరావతిలో  క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో  మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.   పెట్టుబడుల వివరాలను, ఉద్యోగాల గణాంకాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో ఉంచాలని   సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

రాయలసీమ ప్రాంతాన్ని దేశానికే తలమానికంగా నిలిచే  సోలార్ హబ్  మార్చాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీమలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని, తద్వారా రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. ఇందుకోసం పటిష్టమైన గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ఏపీని మేటిగా నిలబెట్టేందుకు శ్రీసిటీ, అనంతపురం వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల  ఏర్పాటు ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ వంటి ఇంధనాలను తయారు చేసే కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

పరిశ్రమల స్థాపనలో భద్రతా ప్రమాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా ఫార్మా మరియు గ్రీన్ ఎనర్జీ విభాగాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్  కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.  గత 22 నెలల్లో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ఏపీ అభివృద్ధికి నిదర్శనమన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుల గ్రౌండింగ్ పనులు ప్రారంభించి,  నిర్ణీత గడువులోగా పరిశ్రమలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని సీఎం ఆదేశించారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.