ఏపీలో శ్రీలంకను మించిన ఆర్థిక సంక్షోభం?
Publish Date:Apr 7, 2022
Advertisement
శ్రీలంక ఎందుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది? అత్యవసర పరిస్థితి విధించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పాకిస్థాన్ ఎందుకు,ఒకే సారి ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది? శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ప్రభుత్వం ఎందుకు కాడి దించేసింది? అధ్యక్షుడు రాజపక్సే అధికారం మోయలేని భారంగా ఎందుకు భావిస్తున్నారు? అక్కడి ప్రజలు అన్నమో రామ చంద్రా, అని అలమటించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం పెద్ద కష్టమేమి కాదు, అది చైనా నుంచా, మరో దేశం నుంచా అనే విషయాన్ని పక్కన పెడితే, అందిన కాడికి అప్పులు చేసి, అనుత్పాదక వ్యయాన్ని పెంచుకుంటూ పోతే శ్రీలంక ప్రభుత్వం, పాకిస్థాన్ సర్కారే కాదు, ఏపీ ప్రభుత్వం, జగన్ సర్కార్’ అయినా, చివరకు సంక్షోభంలో మునిగిపోక తప్పదు. నిజానికి, ఈ చిన్న సత్యం తెలుసుకోవడానికి, ఆర్ధిక శాస్త్రాన్ని అవపోసన పట్టవలసిన వసరం లేదు. ఇది అందరికీ తెలిసిన, అనుభవంలో ఉన్న వాస్తవం. అంతే కాదు, ఏపీ విషయంలో అయితే ఎప్పటి నుంచో ఇటు ఆర్థిక వేత్తలు, అటు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాని హెచ్చరిస్తూనే ఉన్నాయి. పరిస్థితి దిగజారి పోతోంది. రాష్ట్రం అప్పుల్ ఊబిలో కురుపోతోంది. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తునే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతరామన్ సహా కేంద్ర మంత్రులు కూడాఏపీని హెచ్చరిస్తూనే ఉన్నారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక నిపుణులు, జనాకర్షక, ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అద్వాన్నస్థితికి నెట్టి వేస్తుందని హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ,ప్రభుత్వ సీనియర్ అధికారాలు, ఆర్ధికరంగ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో, దేశ ఆర్థిక పరిస్థితి శ్రీలంక దారిన పోయే ప్రమాదం అంతగా లేక పోయినా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ‘ఉచిత’ వరాల ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న అర డజనుకు పైగా రాష్ట్రాలు మాత్రం ఖాయంగా లంకను తలదన్నే సంక్షోభం వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. నిజానికి, శ్రీలంక అప్పు అంటే ఆంధ్రప్రదేశ్ అప్పు ఎక్కువ వుంది. శ్రీ లంక అప్పు, రూ. 2.66 లక్షల కోట్లు, ఏపీ అప్పు రూ.6.58 లక్షల కోట్లు. ఇక దేశంలో పశ్చిమ బెంగాల్ (రూ.7.62లక్షల కోట్లు) తర్వాత, రూ. 6.58 లక్షల కోట్ల అప్పుతో ఏపీ రెండవ స్థానంలో ఉంది.అలాగే, తెలంగాణ ఏపీకు కొంత దిగువన రూ.4.29 లక్షల కోట్ల అప్పుతో నాల్గవ స్థానంలో వుంది. అయితే, ఇంత జరిగినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా కళ్ళు తెరవలేదు. ఏపీ శ్రీలంక దారిలో పోతోందని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎదురు దాడి చేస్తున్నారు. అయితే ఇది తెలుగు దేశం పార్టీ లేద చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణ కాదు. ప్రధాన మంత్రి సమక్షంలో ఉన్నతస్థాయి అధికారులు ఆర్థిక నిపుణులు, పరిస్థితిని సమీక్షించి చేసిన హెచ్చరిక. నిజానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజా ఢిల్లీపర్యటనలో ప్రధాని మోడీ, ఉచితాల విషయంలో గట్టిగా మొట్టికాయలు వేసినట్లు సమాచారం. అయితే, సర్కార్ తీరు మారుతుందా, అంటే, కేంద్రం ముకుతాడు బిగిస్తే ఏమూ కానే, లేదంటే అనుమనామే అంటున్నారు.
అయితే, ఆంధ్ర ప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాలు శ్రీలంక బాటలోనే నడుస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభానికి స్వాగతం పలుకుతున్నాయి. సంక్షేమం పేరిట ప్రజాకర్షక పథకాల అమలు చేసి, ఓటు బ్యాంకును పెంచుకునేందుకు, రాష్ట్రాల ఆర్ధిక స్తోమతను దాటి, అప్పులు చేస్తున్నాయి. నిజానికి,సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పు కాదు, కానీ, అప్పుచేసి,అది కూడా స్తోమతకు మించి అప్పులుచేసి, సంక్షేమం ముసుగులో ఓటు బ్యాంకు పెంచుకోవడం తప్పు, తప్పు మాత్రమే కాదు, నిజానికి ఆర్థిక క్రమశిక్ష పాటించక పోవడం తప్పు కాదు నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు తప్పి అప్పులు చేయకుండా నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వమా ఎఫ్ఆర్ఎంబీ చట్టం తెచ్చింది. అయితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంబీ చట్టం పరిధిని దాటి అప్పులు చేయడమే కాదు. ఇన్నోవెటివ్’గా కార్పొరేషనలను ఏర్పాటు చేసి అందికడికి ప్పులు తెచ్చి ఏపీని రుణాంధ్ర ప్రదేశ్గా మార్చివేసింది. అందిన కాడికి అప్పుచేసింది. ఇక అప్పులు పుట్టని స్థితికి రాష్ట్ర ఆర్థిక స్థితిని దిగజార్చింది.
ఎలా అప్పులు చేసే శ్రీ లంక ఆ దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంధనం, వంటగ్యాస్, నిత్యావసరాల కొరత, గంటల తరబడి కరెంటు కోతలతో ప్రజలు వారాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ పరిస్థితి శ్రీ లంక స్థితికి ఏ మాత్రం తీసిపోదు. ఇప్పుడు ఏపీ లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయి. మొదలవడం కాదు, తారస్థాయికి చేరాయి. రోజులో కరెంటు సప్లై ఉన్న గంటల కంటే, లేని గంటలే ఎక్కవుగా ఉంటున్నాయి.
http://www.teluguone.com/news/content/ap-financial-crisis-moving-beyond-sri-lanka-crisis-39-134049.html





