ఓ సీఎం సారో...నారా లోకేష్ సారో!

Publish Date:Apr 6, 2026

Advertisement

 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంత‌టా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట‌ వినిపిస్తోన్న మాట‌. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య చదువుతున్న వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. 

ప్రభుత్వం నుంచి అందాల్సిన- ఫీజు రీయింబర్స్‌మెంట్  నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రైవేటు కాలేజీల యాజ‌మాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం, హాల్ టికెట్లు ఆపివేయడం వంటి చర్యలు వారి కెరీర్‌ను దెబ్బతీస్తున్నాయి. 

గత రెండు, మూడు అక‌డ‌మిక్ ఇయ‌ర్స్ కి సంబంధించి.. ప్రభుత్వం నుంచి కాలేజీల‌కు అందాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆర్థిక లోటును భరించలేకపోతున్నామని చెబుతున్న యాజమాన్యాలు, ఆ భారాన్ని విద్యార్థులపైకి నెట్టేస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని  కాలేజీలు అంటుండ‌టంతో ఇబ్బంది ప‌డుతున్నారు విద్యార్ధులు. చదువు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, పెండింగ్ ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. 

ఇటీవల బడ్జెట్ విడుదల సమయంలో ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్లు రీయింబర్స్‌మెంట్ కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఇంకా రూ.7,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల అసోసియేషన్లు-PAAP  ఆరోపిస్తున్నాయి. 

ప్రభుత్వం ఒకవైపు  చదువుకు పేదరికం అడ్డుకాకూడదు అని చెబుతూనే, మరోవైపు ఫీజుల పేరుతో విద్యార్థులు పరీక్షలకు దూరం కావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇందుకు రాజాంలోని జీఎంఆర్ ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్ధుల ఉదంతమే ఉదాహరణ. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులను.. ఎగ్జామ్స్ రాయనివ్వకుండా అడ్డుకుంది జీఎంఆర్ ఐటీ యాజమాన్యం. తమకు ఫీజు రీఎంబర్స్ మెంట్ వస్తుందని.. తాము ఫీజులు కట్టలేమనీ.. యాజమాన్యానినికి వీరు ఎంతగానో ప్రాధేయపడ్డారు. అయినా సరే... కనికరం లేకుండా మూడు వందల మంది విద్యార్ధులను పరీక్షలు రాయకుండా అడ్డుకుంది యాజమాన్యం. 

యాజమాన్యం వేధింపులతో ప్రభుత్వానికి లేఖలు రాశారు విద్యార్ధులు. మంత్రి నారా లోకేష్ తమను ఆదుకోవాలని.. జీఎంఆర్ ఐటీ సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ.. ట్విట్టర్, మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. జీఎంఆర్ కఠిన నిర్ణయంతో.. తమ భవిష్యత్ దెబ్బ తింటుందని ఆవేదన చెందుతున్నారు వీరంతా. జీఎంఆర్ తాము ఖర్చు చేసే సేవాకార్యక్రమాల్లో ఇదో పెద్ద విషయమే కాదు. అలాంటిది పేద, మధ్యతరగతి విద్యార్ధులపై ఆ మాత్రం కనికరం లేకుంటే ఎలా? అని వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాములుగా పరీక్షలు రాసిన తర్వాత ఫీజు చెల్లించని విద్యార్ధులకు సర్టిఫికేట్లు ఇవ్వరు. ఇక్కడి పరిస్థితి ఎలా ఉందంటే.. అసలు పరీక్షే రాయనివ్వక పోవడం.. అమానవీయంగా కనిపిస్తోంది. 

ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ పరీక్షలకు అనుమతించేలా ఉన్నత విద్యామండలి కఠిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధులు. పెండింగ్‌లో ఉన్న పూర్తి నిధులను కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని కోరుతున్నారు వీరంతా. ప్రభుత్వ నిధుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న కాలేజీల‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల‌న్న డిమాండ్లు సైతం వెల్లువెత్తుతున్నాయి.

ఒక విద్యార్థి చదువు ఆగిపోతే అది ఒక కుటుంబం ఆశలు ఆవిరైపోవడమే అంటున్నారు త‌ల్లిదండ్రులు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికాకుండా చూడాలని యావత్ విద్యార్థి లోకం కోరుకుంటోంది. ఏపీ సీఎం  చంద్రబాబు- @AndhraPradeshCMO, ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ ని @naralokesh ట్యాగ్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో ఈ  క‌థ‌నాల‌ను ట్రోల్ చేస్తూ తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేస్తున్నారు ఫీజు రీఎంబ‌ర్స్ మెంట్ బాధిత విద్యార్ధులు. మ‌రి చూడాలి ప్రభుత్వ స్పంద‌న ఎలా ఉంటుందో.

By
en-us Political News

  
సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
మొజ్త‌బా ఖ‌మేనీ.. కుటుంబంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు అత్యంత విషాద‌క‌రంగా, గంద‌ర‌గోళంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి ఉన్న స‌మాచారాన్ని బ‌ట్టీ చూస్తే.. ఫిబ్ర‌వ‌రి 28న జ‌రిగిన దాడిలో.. ఇరాన్ సీనియ‌ర్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ.. చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇరాన్ సుప్రీం లీడ‌ర్ గా ఖ‌మేనీ కుమారుడు మోజ్త‌బా ఖ‌మేనీ ఉన్నారు. అయితే ఆయ‌న ప్ర‌స్తుతం కోమ్ న‌గ‌రంలోని ఒక ఆస్ప‌త్రిలో అప‌స్మార‌క స్థితిలో చికిత్స పొందుతున్న‌ట్టు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించింది.
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా ద‌క్షిణాదిలో అత్యంత సంప‌న్న పొలిటీషియ‌న్ల‌లో విజ‌య్ కూడా ఒక‌రు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.