ఉద్యోగుల రెండో దశ ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధం

Publish Date:Apr 7, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు రెండో దశ ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమౌతున్నారు. తమ ఉద్యమం రెండో దశ కార్యాచరణకు సంబంధించి సీఎస్ జవహర్ రెడ్డికి నోటీసు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ తీరు  పట్ల అన్ని వర్గాలలోనూ తీవ్ర అసహనం, ఆగ్రహం పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్తితి రోజు రోజుకూ దిగజారుతోంది. చివరికి ఉద్యోగులు, పెన్షనర్లకు సమయానికి వేతనాలు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అన్నింటికీ మించి ఇప్పటికే తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికి నిధుల కోసం అన్వేషణలోనే ప్రభుత్వం పుణ్యకాలాన్ని గడిపేస్తోంది. ఇక పాలనపై దృష్టి ఎక్కడ సారిస్తుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న ఉద్దేశమే లేనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.  దీంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. చేస్తున్న పనులలో వేగం తగ్గించేశారు. దీంతో కొత్త పనులు మొదలు కావడం లేదు. ఇప్పటికే ఆరంభమైన పనులు పూర్తయ్యే పరిస్థితే కనిపించడం లేదు.

 వేతన జీవులకూ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మేరకే వేతనాల చెల్లింపు జరుగుతోంది. నెల నెలా మొదటి తేదీన అందాల్సిన వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంతే కాదు ఏ శాఖకు ఏ తేదీన వేతనాలు పడతాయో తెలియని పరిస్థితి.  ఇక ఉపాధ్యాయుల పరిస్థితి అయితే మరీ దయనీయం. పీఆర్సీ కోసం పట్టుబట్టారన్న కోపాన్ని వేతనాల విషయంలో తీర్చుకుంటోందా అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహార శైలి ఉంటోంది. నవంబర్ జీతాలు ఇప్పటికీ చాలా జిల్లాలలో టీచర్లకు అందలేదు. ఎప్పుడు అందుతాయో కూడా తెలియని పరిస్థితి.వేతన జీవులకు సకాలంలో వేతనాలు అందకుంటే ఉండే ఇబ్బందులను ప్రభుత్వం అసలు పరిగణనలోనికే తీసుకోవడం లేదు.   ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే వారికి రావలసిన ప్రయోజనాలన్నీ అందజేసి, పెన్షన్ పేపర్లు కూడా సిద్ధం చేసి గౌరవంగా సాగనంపేవారు.  

ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. తమ హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులూ, నిర్బంధాలు. నెలంతా పని చేసి వేతనం అడిగేందుకు వీలులేని పరిస్థితి. జీవితమంతా కొలువు చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి.  ఈ నేపథ్యంలోనే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన రెండో దశ ఉద్యమ కార్యాచరణ నోటీస్ అందజేశారు. డిమాండ్లు పరిష్కారం కానందున ఉద్యమం కొనసాగిస్తున్నామన్నారు. తమది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాదనీ, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమమనీ ఆ నోటీసులు పేర్కొన్నారు.  

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.