Publish Date:Jun 28, 2022
మనసులో బాగా తొలుస్తున్న విషయం ఎంత దాచాలనుకున్నా దాచలేం. ఏదో సందర్భంలో అది బయటకు వచ్చేస్తుంది. కాదూ కూడదూ బయటకు చెప్పడానికి వీల్లేదు అని గట్టిగా అనుకుని బింకంగా నిలబడదామన్నా టంగ్ స్లిప్ అని ఒకటుంటుంది. మన ప్రమేయం లేకుండానే ఆ మాట బయటకు వచ్చేస్తుంది.
ఏపీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి కూడా అలాగే అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ విషయంలో ఆయన టంగ్ స్లిప్ అయ్యింది. అదీ అక్కడా ఇక్కడా కాదు తిరుపతి వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీ వేదికపైనే ఆయన నోరు జారారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ను భూ కబ్జాదారుడిగా అభివర్ణించారు. ఆయన మాట్లాడే మాటలన్నీ అబద్ధాలనీ, అన్యాయమనీ చెప్పేశారు. అంతేనా ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలనీ, మేల్కొని నిర్ణయం తీసుకోవాలనీ పిలుపు నిచ్చారు. జగన్ పై నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.
ఇందుకు సంబంధించిన వీడియోను తెలుగుదేశం వారు సమాజిక మాధ్యమంలో పోస్టు చేసి నిజం నిప్పు లాంటిది.. ఎక్కువ సేపు నోట్లో దాచుకోలేరంటూ ఓ కామెంట్ పెట్టారు. అంతే కాకుండా ఆ వీడియోకు జగన్ పని అయిపోయిందన్న హ్యాష్ టాగ్ కూడా జత చేశారు. ఎవరైనా ఒక సారి నోరుజారుతారు. ఒక పార్టీకి చెందిన వారే పదే పదే టంగ్ స్లిప్ అవుతున్నారంటే.. అది నిజంగా టంగ్ స్లిప్పేనా అన్న అనుమానాలు వ్యక్తం కావడం సహజం. వైసీపీ నేతలలో అసంతృప్తి భగ్గు మంటోందనడానికి ఇటీవల చాలా ఉదాహరణలే కనిపిస్తున్నాయి.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, సొంత పార్టీ నేతలే తనపై కక్షకట్టి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సొంత పార్టీ నాయకులు ప్రతిపక్షాల కంటే ఎక్కువగా తనను టార్గెట్ చేస్తున్నాయని, బాలినేని వాపోతున్నారు. బాలినేని ఈ సంచలన వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆయన గొంతుకు మరో గొంతు తోడైంది, బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు తీవ్రంగా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. కాగా బయటకు వస్తున్న అసమ్మతి స్వరాలల కంటే, బయట పడకుండా కుతకుత ఉడుకుతున్న అసమ్మతి నేతలు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటారని, పార్టీ నాయకులే అంటున్నారు. ఇక తాజాగా డిప్యూటీ స్పీకర్ నారాయణ స్వామి నోరు జారిన వ్యాఖ్యలతో వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని తేటతెల్లమౌతున్నదని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-deputy-speaker-toung-slip-says-jagan-a-land-graber-39-138660.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.