క్షమాపణలు కోరిన ఏపీ డిప్యూటీ సీఎం!

Publish Date:Apr 12, 2020

Advertisement

కరోనా వైరస్ విషయంలో మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిపై చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెనక్కి తీసుకున్నారు. త‌న మాట‌లు ఎవ‌రినైనా బాధించి ఉంటే క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లు తెలిపారు.

"జమాత్ నుంచి వచ్చిన ముస్లిం లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించే ప్రయత్నం చేశాను. కరోనా చికిత్స పొందుతున్న రోగులు వైద్యులకు సహకరించడం. ఇతరులకు వైరస్ అంటుకోకుండా జాగ్రత్త పడాలన్నదే నా ఉద్దేశం. ప్రతీ మతస్థుడు తమ ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చు. ప్రస్తుత కఠిన సమయం లో ఇళ్లలోనే ఇష్ట దేవతల ఆరాధన చేయాలనీ భాద్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి గా సూచిస్తు వస్తున్నాను. భావ వ్యక్తీకరణ లోపం కారణం గానే నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేగాని ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదు." అని నారాయణ స్వామి చెప్పారు.

"నాకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉంది. ఈ విషయాన్ని నా ఆత్మసాక్షి గా చెబుతున్నాను. గత 5 సంవత్సరాలుగా నా వ్యక్తిగత భద్రత ను చూసే గన్ మెన్ కూడా ముస్లిం సోదరుడే. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మతాన్ని, సామజిక వర్గాన్ని కించపరచలేదు. సమాజం లో SC, ST, BC మైనార్టీ వర్గాలు వెనుకబడి ఉన్నాయి. నేను కూడా అణగారిన SC వర్గానికి చెందిన వాడినే. ముస్లిం ల సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వ్యక్తిని. నా నియోజకవర్గం లో ప్రతీ ముస్లిం కి ఇంటి స్థలాలు మొదలుకొని అన్ని సంక్షేమ పధకాలు అందేలా పనిచేస్తున్నాను. వారిపై ఎలాంటి ద్వేషభావం లేని వ్యక్తిని. నా వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పై ముఖ్యమంత్రి గారికి పూర్తి వివరణ ఇచ్చాను. దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నా మాటలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తే క్షమించాలని కోరుకుంటున్నాను. నా మాటలను బేషరతుగా వాపసు తీసుకుంటున్నాను. అల్లా దయతో దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరలోనే వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను." అని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.

నారాయ‌ణ స్వామి.. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఢిల్లీలో సామూహిక మత ప్రార్థనలను నిర్వహించడమే ప్రధాన కారణమని అన్నారు. మత ప్రార్థనల సమయంలో శుభ్రత పాటించి ఉండరని.. ప్లేట్లను కడగరని, స్పూన్లను నాకేస్తుంటారని అన్నారు. దేశ ప్ర‌జ‌లంతా ఓ ప‌క్క ఉంటే, వీరు మాత్రం అర్ధంప‌ర్ధం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని ఓ వైపు విజ్ఞ‌ప్తి చేస్తుంటే, వీళ్లు మాత్రం ప్రభుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌లేద‌ని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నారాయణ స్వామి క్షమాపణలు చెప్పారు.

By
en-us Political News

  
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.