ఏపీలో కాంగ్రెస్ కు వైఎస్ బ్రాండే దిక్కు?

Publish Date:Jul 10, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్వ వైభవం సంగతి అలా ఉంచి కనీసం ఉనికి మాత్రంగానైనా నిలబడాలంటే వైఎస్ బ్రాండే దిక్కని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఇంత కాలం లేని విధంగా ఇప్పుడు వైఎస్ 75వ జయంతిని విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించింది. వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా ఉండటం ఆ పార్టీకి ఒకింత కలిసి వచ్చే అంశంగా భావిస్తోంది. ఆమె ద్వారానే వైఎస్ కాంగ్రెస్ సొత్తు అని చెప్పించడం ద్వారా వైఎస్ బ్రాండ్ ను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందని భావించవచ్చు.

విజయవాడ వేదికగా జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమానికి  పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ మొత్తాన్ని తీసుకుని రావడం ద్వారా ఒక బలమైన సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ ఫొటోలతో  వైసీపీ చేస్తున్న హంగామాను తిప్పికొట్టడానికి, వైఎస్ ఎంత మాత్రం వైసీపీకి చెందిన వ్యక్తి కాదనీ, ఆయన కుమారుడు వైఎస్ రాజకీయవారస్వానికి అనర్హుడు అని చాటడమే లక్ష్యంగా ప్రసంగించడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ రాజకీయవారసురాలిగా షర్మిలను గుర్తించిందని చెప్పడంలో సఫలీకృతులయ్యారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, షర్మిల సీఎం అవుతారు అనడం ద్వారా ఇటీవల ఏపీ ఎన్నికలలో కాంగ్రెస్ జీరో రిజల్ట్ కారణంగా షర్మిలపై మొలకెత్తుతున్న అసమ్మతిని మొగ్గలోనే తుంచేసినట్లైంది. 

రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో ఉనికి మాత్రంగా మిగిలి, గత వైభవాన్ని పూర్తిగా కోల్పోయిన ఏపీ కాంగ్రెస్ లో జవసత్వాలు నింపి, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు రేవంత్ ప్రసంగం నిస్సందేహంగా దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర విభజన తరువాత జరిగిన మూడు ఎన్నికలలోనూ ఏపీలో కాంగ్రెస్ కు వచ్చినది జీరో రిజల్టే. అయితే ఈ సారి ఆ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ గతంలో కంటే బలంగా పుంజుకుంది. కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించకుండా నివారించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. 
ఇక ఏపీలో   వైసీపీ ఓటమిలో కాంగ్రెస్ కూడా కీలక పాత్ర పోషించింది.  వైఎస్ జయంతి సభలో  వైఎస్ ఆత్మగా చెప్పబడే కేవీపీ రామచంద్రరావు చాలా మంది వైసీపీ నాయకులు తనతో టచ్ లో ఉన్నారనీ, ఏ క్షణంలోనైనా వారంతా కాంగ్రెస్ గూటికి చేరతారంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపడం ఖాయం.  

తాజా ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం కారణంగా ఆ పార్టీ ఇప్పుడు నిస్తేజంగా మారింది. ఆ గ్యాప్ ను కాంగ్రెస్ ఫిల్ చేసే అవకాశాలే ఉన్నాయి. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండటం, ఆమెకు వైఎస్ ఆత్మ అండగా నిలవడంతో రాష్ట్రంలో వైఎస్ లెగసీని కాంగ్రెస్ సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.