నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఏపీ సీఎం సంతాపం.. చంద్రబాబు హుందాతనానికి నిదర్శనం

Publish Date:Apr 23, 2026

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం (ఏప్రిల్ 22) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక రాజకీయ యోధుడిగా నాదెండ్ల ప్రస్థానం సాగిందని పేర్కొన్న చంద్రబాబు ఆయన మృతి పట్ల  ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అంతే కాదు నాదెండ్ల భాస్కరరావు భౌతికకాయానికి నివాళులర్పించడమే కాకుండా.. ఆయన కుమారుడు, ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషాద సమయంలో మనోహర్‌కు,  వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేసిన ముఖ్యమంత్రి, నాదెండ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి నాదెండ్ల భాస్కరరావు పలు సందర్భాల్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

గత కొన్నేళ్లుగా నాదెండ్ల భాస్కరరావు యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ఎన్టీఆర్, చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా.. చంద్రబాబు వాటన్నింటినీ  పక్కన పెట్టి సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు పట్ల గౌరవం ప్రదర్శించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే..  కానీ మరణం సంభవించినప్పుడు వ్యక్తిగత విభేదాలకు, రాజకీయ  విభేదాలకు తావు ఉండకూడదని చంద్రబాబు నిరూపించారు.

రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయన్న విమర్శల నడుమ.. ముఖ్యమంత్రి చంద్రబాబు హుందాగా వ్యవహరించారు.  గతాన్ని మరిచి, ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం ద్వారా చంద్రబాబు తన రాజకీయ పరిణితిని చాటుకున్నారు. ఒకప్పుడు రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉన్నప్పటికీ, అంతిమంగా మానవీయతకే చందరబాబు పెద్దపీట వేశారని  రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.  అది పక్కన పెడితే నాదెండ్ల భాస్కరరావు మృతితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసినట్లయింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా నాదెండ్ల మృతికి సంతాపం ప్రకటించారు. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.