ముందస్తు మత్తులో నాడు బాబు.. నేడు జగన్

Publish Date:Mar 31, 2023

Advertisement

మరో సారి అధికారానికి ముందస్తు అడ్డదారిగా ఎంచుకుని భంగపాటుకు గురైన ముఖ్యమంత్రుల సంఖ్య తక్కువ ఏమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాగే ముందస్తుకు వెళ్లి అధికారాన్ని నిర్దిష్ట గడువు కంటే ముందే చేజార్చుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఇద్దరూ తమ పాలనపై ప్రజా వ్యతిరేకతను పసిగట్టే అది మరింత పెరిగి మొదటికే మోసం రాకుండా జగ్రత్త పడే యోచనతోనూ ముందస్తుకు సిద్ధపడ్డారని చెప్పాలి.  

ఏపీ ఆవిర్భావం నుంచి 1978 వరకు షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా 1982లో నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైకమాండ్‌ అనుమతితో ఎన్నికలను ముందుకు జరిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.  202 స్థానాలు సాధించడంతో ఎన్టీఆర్‌ సీఎం అయ్యారు. ఇందిరాగాంధీ హత్యతో సానుభూతి వెల్లువెత్తుతుందని సందేహాలున్నా ఎన్టీఆర్ ముందస్తుకు వెళ్లి ఘన విజయం సాధించారు.  

తర్వాత 1990 మార్చిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ ఎన్నికలను నాలుగునెలల ముందుకు జరిపారు. అప్పుడు ఎన్టీఆర్ కు ఆ ముందస్తు కలిసి రాలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది.  ఘన విజయం సాధించిన కాంగ్రెస్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో  ప్రభుత్వం ఏర్పాటైంది.

1994లో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అయితే ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత 1999లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు రెండు నెలల ముందు నిర్వహించడంతో తెలుగుదేశం విజయఢంగా మోగించింది. ఆ తరువాత 2004 వరకూ గడవు ఉన్నప్పటికీ చంద్రబాబు ముందస్తుకు మొగ్గు చూపారు.

2003 నవంబర్ లోనే అసెంబ్లీని రద్దు చేశారు. వరుస సంవత్సరాలు వర్షాభావంతో పంటలు పండక రైతులు ఇబ్బందులు పడటం, వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటం వంటి కారణాలతో  ప్రభుత్వ వ్యతిరేకత (యాంటీ ఇన్ కంబెన్సీ) పెరగడంతో అది పెరగకుండా ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు బావించారు. అలాగే మావోయిస్టుల దాడి తరువాత వచ్చిన సానుభూతి ఆశలు కూడా ఎన్నికలలో లబ్ధి చేకూరుతుందన్నభావనతో అప్పట్లో చంద్రబాబు ముందస్తుకు మొగ్గు చూపారు.  అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.  వైఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది.  ఇప్పుడు వైసీసీ అధినేత, సీఎం జగన్ కూడా అధికారం చేజిక్కించుకున్న నాలుగేళ్లలోనే ప్రజా వ్యతిరేకత తీవ్రం అవ్వడాన్ని గమనించి.. తన ఫ్లాగ్ మార్క్ నగదు పందేరం పథకాలు కొనసాగుతున్న సమయంలోనే ముందస్తుకు వెళ్లి మంచి ఫలితం పొందాలన్న ఉద్దేశంతో ముందస్తుకు మొగ్గు చూపుతున్నారు.

2003లో చంద్రబాబు తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో ప్రజలలో ఆయన పట్ల, కాంగ్రెస్ పట్ల సానుకూలత వ్యక్తం అవ్వడం కూడా అప్పట్లో తెలుగుదేశం పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఇప్పుడు జగన్ విషయంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యక్తమౌతున్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, తెలుగుదేశం యువనేత లోకేష్ పాదయాత్ర కూడా ప్రజలలో ప్రభంజనం సృష్టిస్తోంది. పాయదాత్రలో ఆయనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అంతటా సానుకూలత వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో జగన్ ముందస్తుకు వెడితే ముందస్తుగా అధికారం చేజారే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.