ఏపీ మంత్రివర్గ విస్తరణ.. ఎవరు ఇన్.. ఎవరు ఔట్..
Publish Date:Jul 21, 2016
Advertisement
రాష్ట్రం విడిపోయి రెండేళ్లు అయింది.. ఎవరి రాష్ట్రంలో వారు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది. అయితే ఏపీలో టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా మంత్రివర్గ విస్తరణానికి మాత్రం పునాదులు పడలేదు. ఇదిగో ఇప్పుడ జరగుతుంది.. అప్పుడు జరుగుతుంది అంటూ గత రెండేళ్లనుండి చెప్పుకుంటూ వస్తున్నారు తప్పా.. ఇంతవరకూ మంత్రివర్గ విస్తరణ జరిగింది లేదు.. అయితే ఇప్పుడు తాజా పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు దీనికి త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారట. దీంతో అప్పుడే మంత్రుల్లో టెన్షన్ స్టార్ట్ అయిందట.
నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు 19 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటినుండి.. ఇప్పటిదాకా వారే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు మరికొంతమందికి అవకాశం ఇవ్వచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ లో నేతలతో పాటు.. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన నేతల్లో కూడా ఆశలు చిగురిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొంతమందిని తప్పించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు కళా వెంకట్రావును తీసుకోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఆయన్ని కనుక తీసుకుంటే మంత్రి మృణాళిని తన పదవిని కోల్పోవచ్చని తెలుస్తోంది. ఇంకా వైసీపీ నుండి వచ్చిన వచ్చిన జ్యోతుల నెహ్రూకి కూడా మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పయ్యావుల కేశవ్ లకు వాగ్ధాటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని కూడా క్యేబినెట్లోకి తీసుకుంటే బావుంటుందని ఆలోచిస్తున్నారట. మరి చూద్దాం చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో.. ఆయన ఎవరికి అవకాశం కల్పిస్తారో.
http://www.teluguone.com/news/content/ap-cabinet-entend-39-64062.html





