పార్టీకి ప్లస్సా.. మైనస్సా? సంజయ్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో చర్చ
Publish Date:Jan 6, 2021
Advertisement
తెలంగాణలో దూకుడు రాజకీయాలతో పాపులర్ అయిన బండి సంజయ్.. తొలిసారి ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు సంబంధించి తనదైన శైలిలోనే జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. డైరెక్ట్‌గా మత గ్రంథాలను బేస్ చేసుకొని చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు బండి సంజయ్. ఏపీ ప్రజలు బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలని కామెంట్లు చేశారు. ఆలయాలపై దాడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. అయితే ఏపీ బీజేపీకి మాత్రం సంజయ్ కామెంట్లు ఇబ్బందిగా మారాయనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జనసేనతో కలిసి బీజేపీ పని చేస్తోంది. రెండు పార్టీలు కలిసే ఉద్యమాలు చేస్తున్నాయి. త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ బీజేపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థే పోటీ చేస్తారని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. ఆలయాలపై దాడులకు నిరసనగా ఉద్యమిస్తున్నా.. ఎక్కడా మతాల పరంగా మాట్లాడటం లేదు బీజేపీ, జనసేన నేతలు. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా క్రిస్టియన్. అందుకే అంతేకాదు గతంలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులందరినీ ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపుతామని హామీ ఇచ్చింది. ఇంకా చాలా రాష్ట్రాల్లో క్రిస్టియన్ల కోసం అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు పూర్తిగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా బండి సంజయ్ మాట్లాడితే... జనాలు ఎలా అర్థం చేసుకుంటారనే చర్చ నడుస్తోందట. తెలంగాణలో పార్టీ బలోపేతానికి హిందుత్వ కార్డునే ప్రధాన అస్త్రంగా వాడుతోంది బీజేపీ. గ్రేటర్ ఎన్నికల్లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారమంతా ఎంఐఎం టార్గెట్ గానే సాగింది. అందువల్లే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. కాని తెలంగాణతో పోలిస్తే ఏపీలో మత పరమైన రాజకీయాలు చాలా తక్కువ. అందుకే బండి సంజయ్ అలా మాట్లాడాల్సింది కాదనే అభిప్రాయం ఏపీ బీజేపీలోనే వస్తుందంటున్నారు. ఆలయాలపై దాడులను ఖండిస్తూ ఏపీ ప్రభుత్వంపై ఎంత ఘాటుగా విమర్శలు చేసినా సమస్య కాదని.. కాని బైబిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలా అన్న వ్యాఖ్యలే తమకు కొంత ఇబ్బందిగా మారాయని కొందరు నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ల టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తూ.. క్రిస్టియన్ ను పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ తో కలిసి ప్రచారం ఎలా చేస్తామన్న అభిప్రాయం కొందరు కమలం నేతల నుంచి వస్తుందట. అందుకే ఏపీ బీజేపీ నేతలు కూడా డ్యామేజీ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. తమది హిందుత్వ పార్టీ కానీ, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేయడమే ఇందుకు ఉదాహరణ. విశాఖలో మాట్లాడిన సోము వీర్రాజు ఈ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ కామెంట్లతో వచ్చిన ఇబ్బందిని చక్కదిద్దేందుకే సోము ఈ కామెంట్లు చేశారని చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణలో దూకుడు రాజకీయాలతో అదరగొట్టిన బండి సంజయ్.. ఏపీ రాజకీయాలపై మాత్రం కొంత తొందరపడ్డారనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వస్తోందని తెలుస్తోంది.
బీజేపీ నేతలు కూడా మతాల విషయంలో కూల్ గానే ఉంటున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఇప్పుడు కొత్త వాదన వస్తోంది. ఒక క్రిస్టియన్‌ను మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి .. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు.. ఏపీ ప్రజలకు బైబిల్ పార్టీ కావాలా.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలని సంజయ్ ఎలా మాట్లాడారన్న పాయింట్‌ను కొందరు తెరమీదకు తీసుకువస్తున్నారు. బీజేపీకి కూడా ఇది పెద్ద సమస్యగానే మారిందంటున్నారు.
http://www.teluguone.com/news/content/ap-bjp-leaders-worry-on-bandi-sanjay-comments-39-108598.html





