నాలుగుగోడల మధ్యా తొడగొట్టిన చందంగా జగన్ ప్రెస్ మీట్లు.!

Publish Date:Aug 14, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. డిస్ క్వాలిఫై చేయాలి. జీత భత్యాలు నిలిపివేయాలి  అంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను పక్కన పెట్టినా.. జగన్ శైలి, తీరు పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో హా పెద్ద ఎత్తున జరుగుతోంది.  అసెంబ్లీ వేదికగా  ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వైసీపీ..   ప్రతిపక్ష హోదా అంటూ సభా సమావేశాలను బాయ్ కాట్ చేయడం.. యుద్ధ రంగంలోకి దిగకుండా నాలుగు గోడల మధ్యా కూర్చుని తొడగొడుతున్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. యుద్ధ భూమిలో వెన్ను చూపడం ఎలాంటిదో.. రాజకీయ సమరంలో ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీకి గైర్హాజరు కావడం కూడా అలాంటిదేనని పరిశీలకులు అంటున్నారు.    ప్రజలు ఇవ్వని11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష హోదా అన్నది నిబంధనల ప్రకారం అవకాశం లేదు. ఆ సంగతి తెలిసికూడా ప్రతిపక్ష హోదా  కోసం మంకుపట్టు పడుతూ సభా సమావేశాలకు దూరంగా ఉండటం ఆయన పరిణితి లేమికి, పలాయనవాదానికీ నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇదే ఆయనలోని నాయకత్వసమర్థతపై కూడా సందేహాలకు తావిస్తోందంటున్నారు.  

చట్టసభ వేదికగా ప్రజల సమస్యలను వినిపించడం, ప్రభుత్వ పథకాలు, విధానాలలో ఉన్న లోపాలను ఎండగట్టాల్సిన ఆయన.. ప్రతిపక్ష హోదా కోసం సభా బహిష్కరణకు నిర్ణయించుకోవడం సమజసం కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.  నియమ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం సభ్యుల బలం ఉన్న పార్టీకే అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. 2024   అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో.. ఏ రకంగా చూసినా, ఆయన ఎంతగా పట్టుబట్టినా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. ఐదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పని చేసిన జగన్ కు ఆ విషయం తెలియని భావించలేం. ఒక వేళ విపక్ష హోదా లేకపోయినా.. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సభకు హాజరై నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలి. తనను నమ్మి గెలిపించిన పులివెందుల ప్రజల పట్ల ఆ మాత్రమైనా బాధ్యత వహించాలి.   పులివెందుల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, వైసీపీ  అధినేతగా జగన్ సభకు హాజరై  ప్రభుత్వాన్ని నిలదీయడం మాని తనకు వీలున్నప్పుడు, వీలైనప్పుడు మాత్రమే బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి మీడియాకు ముఖం చూపించి తన పని ఇంతే అన్నట్లు వ్యవహరించడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  

అసెంబ్లీకి దూరంగా ఉంటూ  తాడేపల్లి ప్యాలెస్ లో  మీడియా సమావేశాలకు పరిమితమై,  ఆ ప్రెస్ మీట్ లలో కూడా రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి అంతేనని చుతులు దులుపుకుపోతున్న జనగ్ తీరు పట్ట వైసీపీ క్యాడర్ లో సైతం అసంతృప్తి వ్యక్తమౌతోంది.   ప్రభుత్వ నిర్ణయాలను సభలో నిలదీస్తే వచ్చె ఎఫెక్ట్ ప్రోస్ మీట్ లో ప్రసంగాల వల్ల రాదని పరిశీలకులు అంటున్నారు. 

  శాసనమండలిలో వైసీపీకి  సంఖ్యాబలం ఉన్నందున, అక్కడ గట్టిగా పోరాటం చేయాలని జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సరే.. కానీ  , అసెంబ్లీలో స్వయంగా పార్టీ అధినేత జగన్ పోరాడకుండా ప్యాలెస్ కే పరిమితం అవ్వడం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలే ఇస్తున్నాయి.  

ఇక పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నిలుపుకోవాలనుకునే నాయుడు ప్రజా పోరాటాల్లో వారిని ముందుండి నడిపించాలే కానీ, పిలుపు ఇచ్చాను చాలదా అన్న తీరున వ్యవహరిస్తే... పార్టీ శ్రేణులు డీలా పడతాయనీ, కంచె చేను సామెత చెప్పినట్లు తాడేపల్లి ప్యాలస్ నుంచే  పార్టీని నడిపిస్తానంటే.. ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా కడపదాటకుండానే  మమ అనిపించేస్తారని అంటున్నారు.  

AP Assembly Sessions, YS Jagan Mohan Reddy Assembly Boycott, Chandrababu Naidu Leadership, AP Political News Telugu, Opposition Status Issue AP

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.