అసెంబ్లీ బహిష్కరణ కొనసాగింపునకే వైసీపీఎల్పీ సమావేశం నిర్ణయం.!

Publish Date:Aug 12, 2026

Advertisement

ఏపీ అసెంబ్లీ  వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో  వైసీపీ శాసనసభాపక్షం బుధవారం (ఆగస్టు 12)న భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సాధారణంగా ఏ పార్టీ అయినా శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది.

దీంతో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం అనగానే.. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణకు స్వస్తి చెప్పి సభకు హాజరు కానుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది.  అయితే వైసీపీ శాసనసభాపక్ష సమావేశం మాత్రం అసెంబ్లీ బహిష్కరణను కొనసాగించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇప్పుడూ ప్రతిపక్ష హోదాపై స్పష్టత రానందున సభను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది.  

2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ సంఖ్య సభ్యులతో సభలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకావం ఇసుమంతైనా లేదు.  అయితే వైసీపీ మాత్రం నిబంధనలతో పని లేకుండా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, పార్టీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఆ డిమాండ్ తో నే అసెంబ్లీ బహిష్కరణ చేస్తున్నది.

 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.  ముఖ్యంగా  మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో  అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వాన్ని మండలిలో నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ శాసనమండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు.   

AP Assembly,  Monsoon Sessions, YSRCP Boycott,  Jagan Leader of Opposition Status, AP Legislative Council,  TeluguOne

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.