ఏపీ మద్యం ముందు.. ఉగ్రవాదం, ప్రపంచయుద్ధాలూ బలాదూర్!

Publish Date:Nov 13, 2023

Advertisement

 జగన్ సర్కార్ చీప్ లిక్కర్  రాష్ట్రంలో మరణమృదంగం మోగిస్తోంది. సర్కార్ అండతో  సర్కార్ వల్ల, సర్కార్ చేత, జగన్ కోసం సాగుతున్న ఈ మాఫియా కారణంగా ఉగ్రవాదులు ప్రపంచమంతా కలిపి సృష్టించే మారణహోమం కంటే  ఏపీలో ఎక్కువ వరణాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గణాంకాలతో సహా వెల్లడించారు.  బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏపీలో జగన్ సర్కార్ మద్యం మాఫియాపై ఎప్పటికప్పుడు లెక్కలతో సహా  వివరిస్తూ ఎండగడుతున్నారు.  ఏపీలో లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను మద్యం షాపులలో అమ్మకాలకు నియమించి.. ప్రభుత్వ డీస్లరీల నుండే సరుకుని సరఫరా చేస్తున్నారు. దీంతో  రాష్ట్రంలో మద్యం నాణ్యతా ప్రమాణాల విషయంలో అధమస్థానంలో నిలుస్తున్నది.  మద్యం తయారీ కంపెనీలకు సకాలంలో చెల్లింపులు వెళ్లక ప్రీమియం మద్యం తయారీ దారులు ప్రభుత్వ డీస్లరీలకు మద్యం సరఫరా చేయడం లేదు. కానీ రకరకాల పేర్లతో కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొచ్చి నాణ్యత లేని లిక్కర్ ను యథేచ్ఛగా భారీ ధరలకు అమ్ముతూ  ప్రజారోగ్యానికి చెల్లు చీటీ రాసేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ప్రభుత్వమేనని పురంధేశ్వరి ఆరోపిస్తూ, ఏపీ మద్యం విధానానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.  కనీస పరీక్షలు కూడా చేయని మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి అమ్మేస్తూ ప్రజల ఉసురుతీసేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

అయితే, విపక్షాలు ఎన్ని ఆరోపించినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండడం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే కొత్త పేర్లతో పుట్టుకొచ్చిన కంపెనీలకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని ఎదురుదాడికి దిగుతోంది. అయితే అసలు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్  ప్రభుత్వం ఆ కంపెనీలపై దాడులు చేసి నాణ్యత ప్రమాణాలు, తయారీ విధానంలో లోపాలుంటే చర్చలు తీసుకొనే అవకాశం ఉంది. కానీ, జగన్ సర్కార్ ఆ చర్యలు తీసుకోకుండా గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎదురుదాడి చేసి  చేతులు దులిపేసుకుంటోంది.  కనీస పరీక్షలు కూడా చేయకుండా మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి ప్రభుత్వ దుకాణాలకు అందిస్తుండతో తెలిసిన కంపెనీ మద్యం ఒక్కటీ లేకపోవడంతో ప్రజలు ఉన్న దాన్నే తాగేసి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.  ఏపీలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో సగం మంది అనారోగ్యానికి ఏపీ ప్రభుత్వ మందు దుకాణాలు సరఫరా చేసిన మద్యం సేవించడమే కారణం. ఈ విషయాన్ని  బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పుంరంధేశ్వరి సాధికారికంగా, గణాంకాలు, ఆధారాలతో సహా తేల్చిన వాస్తవం. 

 తాజాగా పురంధేశ్వరి ఏపీలో చీప్ లిక్కర్ వలన ఏకంగా 5 లక్షల మంది చనిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల కారణంగా పాకిస్థాన్‌లో ఏటా వెయ్యి మంది మృతి చెందుతుండగా.. ఇజ్రాయెల్‌-గాజా మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు అసువులు బాసిన వారి సంఖ్య పన్నెండు వేల లోపే.  అయితే  ఏపీలో జగన్‌ సర్కారు మందు ఇంత వరకూ   ఐదులక్షల మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని.. ఇక అనధికారికంగా లెక్క వేసుకున్నా మొత్తం ఆరు లక్షల మంది జగన్‌ మందు తాగి చనిపోయానట్లు అధికారిక లెక్కలనే సాక్ష్యంగా చూపుతూ పురంధేశ్వరి సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇటీవల కడపలో సభలో మాట్లాడిన పురందేశ్వరి రాష్ట్రంలో జగన్‌ మద్యం తాగి రోజుకు 700 మంది చనిపోతున్నారని ఆరోపించారు. దీంతో మరోసారి పురంధేశ్వరి వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కానీ.. సీఎం కానీ దీనిపై ఇప్పటి వరకూ స్పందించిన దాఖలాలు లేవు కానీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం పురందేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.  

ఏపీలో మద్యం నాణ్యత లేదన్న మాట వాస్తవం. ఇది ఏపీ ప్రజలకే కాదు.. పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో ఈ అంశంపై భారీ స్థాయిలో పోస్టులు వస్తున్నాయి.  ఇక ఈ చీప్ లిక్కర్ ను ప్రీమియం బ్రాండ్ల పేర్లతో కలిసి అమ్ముతూ జగన్ సొమ్ము చేసుకుంటున్నది కూడా వాస్తవమే. ఇలాంటి లిక్కర్ వలన ప్రజల ఆరోగ్యం పాడై ఆసుపత్రుల పాలవుతున్నారన్నదీ వైద్యులు, నివేదికలు రుజువు చేసిన నిదర్శనం. ఇదే విషయాన్ని పురంధేశ్వరి లెక్కలతో సహా చెప్తున్నారు. కానీ, దర్యాప్తు చేయాల్సిన ప్రభుత్వం, ఆ శాఖ మంత్రి మాత్రం స్పందించడమే లేదు. ఒకరకంగా ప్రభుత్వం ఈ ఆరోపణలన్నీ నిజమని ధృవీకరించినట్లే భావించాల్సి వస్తుంది. పైగా రివర్స్ లో గత ప్రభుత్వం మద్యం పాలసీ తప్పంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద మద్యం కేసు నమోదు చేసింది. అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు.. రాష్ట్ర ప్రజలకు అదే మద్యంతో మరణశాసనం లిఖించాడని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.