కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. చ‌నిపోతున్న అడవి పందులు..

Publish Date:Jul 1, 2022

Advertisement

వైరస్ ఇక మనుషుల నుంచి కాక జంతువుల నుంచి వచ్చే అవకాశం ఉందా?

ప్రస్తుతం శాస్త్రజ్ఞులను వేదిస్తున్న పెద్ద సమస్య. వైరస్ లు ఇక జంతువుల నుండి వచ్చే అవకాశాని 
కొట్టి పారేయలేము అని అన్న కొద్దిరోజులకే కేరళలో ఆంత్రాక్స్ కలకలం ప్రజలలో తీవ్ర ఆందోళనకు 
కారణమౌతోంది. ఆంత్రాక్స్ ఒకప్పుడు ఆ పేరు వింటేనే మనకు నరకం,  ప్రాణం పోయినంత పని అయ్యేది. గతంలో మన ఇంటికి వచ్చే పార్సిల్స్ లో ఆంత్రాక్స్ పొడిని పంపి నట్లు తెలిపెవారు. ఆరకంగా ఆంత్రాక్స్ కు భయపడే వారు ఆంత్రాక్స్ తో చనిపోతా మేమో అని ఆందోళనకు గురియ్యే వారు. ఆరకంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఆంత్రాక్స్ ఇప్పుడు కేరళలో వెలుగు చూసిందని  ప్రభుత్వ  అధికారులు వెల్లడించారు.

తిరువనంతపురం లో ఇటీవల అధికసంఖ్యలో అడివి పందులు  మరణించాయని కేరళ లోని అతిరా పిల్లి అటవీ ప్రాంతం లో కొన్ని రోజులుగా ఇలా జరుగుతోందని, దీనికి కారణం ఆంత్రాక్స్ సోకడమే అని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కేరళా ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ అడవి పందులలో ఆంత్రాక్స్ ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. అతిరా పిల్లి అటవి ప్రాంతం లో పెద్ద సంఖ్యలో జంతువులు మరణించడం తీవ్ర ఆందోళనకలిగిస్తోందని.ఈమేరకు అధికారులు అటవీ ప్రాంతం లో సేకరించిన నమూనాల ఆధారంగా ఆంత్రాక్స్ ఇన్ఫెక్షన్ గా తేల్చారు అని జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంత్రాక్స్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆంత్రాక్స్ బ్యాక్టీరియా సహజంగానే భూమిలో ఉంటుందని పెంపుడు జంతువులు, అటవీ ప్రాంతం లో ఉండే జంతువుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆంత్రాక్స్ అంటే ఏమిటి?

ఆంత్రాక్స్ చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాధి. గ్రామ్ పోజిటివ్ అనే బ్యాక్టీరియా దీనికి కారణం అవుతుంది. దీనిని బెసిలిన్ అంత్రాసిస్ అని అంటారు. సహజంగా ప్రకృతిలో ఉండడం వల్ల పెంపుడు జంతువులలో వస్తుంది.ఆంత్రాక్స్ వల్ల జంతువులు చనిపోతాయి. ఆంత్రాక్స్ వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతారు.ఆంత్రాక్స్ సోకిన జంతువుల ఉత్పత్తులు ద్వారా ఆంత్రాక్స్ సంక్రమించే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో జీవించే జంతువులలో మనుషులు వ్యాపరద్రుక్పదం తో పెంచే జంతువులు ఆవులు, గొర్రెలు నివసించే ప్రాంతాలలో ఆంత్రాక్స్ సోకే అవకాశం ఉంది అని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆంత్రాక్స్ లక్షణాలు ఎలాగుర్తించాలి...

ఆంత్రాక్స్ సోకిన జంతువులు అక్కడి కక్కడే చనిపోతాయి.జంతులు చనిపోడానికి ముందు తీవ్రమైన జ్వరం,ముక్కు నోటి నుండి రక్తం కారడం వంటి లక్షణాలు ఉంటాయి . అయితే ఈ లక్షణాలు చాలా జంతువులలో కనపడక పోవచ్చు. పెద్ద సంఖ్యలో జంతువులు చనిపోతున్నప్పుడు అది ఆంత్రాక్స్ గా గుర్తించక పోవడం వల్ల చనిపోవడం గమనించవచ్చు నని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంత్రాక్స్ కు అసలు కారణం పూర్తిగా తెలియరాలేదని పెద్దసంఖ్యలో ఆంత్రాక్స్ మహమ్మారి సోకినప్పుడు ఆంత్రాక్స్ నివారణ పూర్తిగా కష్ట సాధ్య మౌతుంది. అధికసంఖ్యలో జంతువులు మరణించినప్పుడు ముఖ్యంగా ఆవులు,గేదెలు,గొర్రెలకు ముందే ఆంత్రాక్స్ పరీక్షలు నిర్వహించి ఉంటె చనిపోయి ఉండేవి కాదనేది నిపుణుల వాదన. అయితే మానవులకు ఆంత్రాక్స్ సోకకుండా నివారించడం అవసరం.

ప్రజలకు ప్రమాదం ఉంటుందా?

ఆంత్రాక్స్ వల్ల పెద్దమొత్తం లో చనిపోయిన దాఖలాలు లేవని నిపుణులు అంటున్నారు.ఎవరైతే రైతులు చనిపోయిన జంతువుల కళేబరాలు తీస్తారో గోడల చావిళ్ళు,లేదా గొర్రెలు పెంచే షెడ్లలోఉండే వారు లేదా పని చేసే వారికి  వ్యాధి సోకిన జంతువునుండి ఇన్ఫెక్షన్ సోకవచ్చు లేదా మనకు తెలియకుండా ఆంత్రాక్స్ సోకిన జంతువుల మాంసం తీసుకున్నా ఆంత్రాక్స్ బారిన పడవచ్చునని నిపుణులు అంటున్నారు. 2౦౦7 లో తొలి సారి ఆంత్రాక్స్ వెలుగు చూసింది అప్పుడు చర్మం ఇన్ఫెక్షన్ కు గురియ్యింది. దానినుండి యాంటి బాయిటిక్స్ తో కోలుకోవచ్చు.

ఆంత్రాక్స్ రాకుండా చేపట్టాల్సిన చర్యలు...

*వ్యాధి విస్తరణ నిరోదించాలి.
*పెంపుడు జంతువులు ఆంత్రాక్స్ రాకుండా జాగ్రత పడాలి.
*లైవ్ స్టాక్స్  ఉత్పత్తులు ఎగుమతులు మార్కెట్లకు చేరకుండా జాగ్రత పడాలి.
*ఆంత్రాక్స్ విస్తరించకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి.
*అత్యవర చికిత్సా విభాగాలు ముఖ్యంగా మొబైల్ వేటర్నరీ సేవలు అందుబాటులో ఉంచాలి.

By
en-us Political News

  
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం.
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి.
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  
టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషికి తెలియని, అంతుబట్టని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  కొన్ని పరిస్థితులను చాలామంది పెద్ద సమస్యలేమీ కాదులే అని లైట్ తీసుకుంటారు.
"పిల్లలకు డిప్రెషన్ వస్తుందా?" అనే ప్రశ్నకు చాలా మంది తల్లిదండ్రుల సమాధానం "రాదు" అనే ఉంటుంది.
పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది.  ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు.
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం.
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ..
Insomnia, Insomnia Treatment, Sleep Problems, Sleep Disorder, Deep Sleep Tips, How to Sleep Better, Insomnia Causes,  Healthy Sleep, TeluguOne Health,
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి.
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.