తమిళనాడులో మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ.!?
Publish Date:Jul 7, 2026
Advertisement
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి విజయ్ చరిత్ర సృష్టించారు. కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో.. ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా.. తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు. Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
http://www.teluguone.com/news/content/another-star-hero-to-enter-politics-in-tamil-nadu-39-225271.html





