ప్ర‌దీప్‌కు దేశ‌మంతా సెల్యూట్‌.. కోచింగ్‌కు ముందుకొచ్చిన ఆర్మీ జ‌న‌ర‌ల్‌!

Publish Date:Mar 23, 2022

Advertisement

ఆ పిల్లాడు పరిగెడుతున్నాడు.. ఎక్కడికో .. ఎందుకో తెలియదు. కానీ, సారి ఆ పిల్లాడి సంకల్పం, గమ్యం తెలిసిన తర్వాత, దేశం కాదు, ప్రపంచం అతనికి సెల్యూట్ చేసింది. అవును, సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడి స్ఫూర్తిదాయకమైన వీడియో గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం.  ఇప్పడు దేశం మొత్తం ఆ వీడియో  చూస్తోంది. నిజానికి, దేశం మొత్తం ఆ యువకుడికి, సాల్యూట్ చేస్తోంది. అవును, అది అతిశయోక్తి కాదు. నిజం, ఓ వంక పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తూ మరోవంక సైన్యంలో చేరి దేశమాత సేవచేసే లక్ష్య సాధన కోసం రోజుకు పదికిలోమీటర్ల దూరం పరుగులు తీస్తున్న ఆ యువకుడితో కారులో వెళుతున్న చిత్రనిర్మాత వినోద్ కప్రీ సాగించిన సంభాషణ ఒక్క సారి చూసిన వారు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అందరికీ షేర్ చేస్తున్నారు. శభాష్ అంటున్నారు. సెల్యూట్ చేస్తున్నారు. 

నిజానికి, ఆ వీడియో వైరల్ అయ్యేవరకు, ఈ యువకుడు ఎవరో, ఎందుకు పరుగులు తీస్తున్నారో, ఎవరికీ తెలియదు. ఎవరు పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే వినోద్ కప్రీ వీడియో షేర్ చేశారో, ఇక అక్కడి నుంచి ఆ యువకుడు దేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యాడు. అందరి దీవెనలు అందుకుంటున్నారు. ఇంతకీ, ఆ భరత మాత ముద్దు బిడ్డ ఎవరో తెలుసా,  ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన ప్రదీప్ మెహ్రా. నిజానికి, ప్రదీప్ మెహ్రా  ఎప్పటి నుంచో రోజు అదే చేస్తున్నా, ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు అతను రాత్రికి రాత్రి, దేశంలోనే కాదు, అంతర్జాతీయంగాను గుర్తింపు పొందాడు. ఎందరి గుండెల్లోనో గుడికట్టుకున్నాడు. సైన్యంలో చేరాలి, దేశమాత సేవ చేయలనే సంకల్పం, పట్టుదలతో  కోట్లాదిమంది మంది హృదయాలను గెలుచుకుంటున్నాడు.

అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత వినోద్ కప్రీ ఆ యువకుడితో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెహ్రా నోయిడాలోని సెక్టార్ 16లోని తన ఆఫీస్ నుంచి బరోలాలోని తన ఇంటికి ప్రతిరోజూ 10 కి.మీ. పరిగెడుతున్నట్లు చెప్పాడు. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో, ప్రదీప్ మెహ్రా  పరుగు తీస్తూనే తన పరుగు ఏ గమ్యం చేరటం కోసమో చెప్పుకొచ్చాడు. సైన్యంలో చేరేందుకే, ప్రతి రోజు తాను పనిచేసే కార్యాలయం నుంచి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి పరిగెడుతూ ప్రాక్టీసు చేస్తున్నానని చెప్పారు. వినోద్ కప్రీ, లిఫ్ట్ ఇస్తానని చెప్పినా,  ప్రదీప్ మెహ్రా  సున్నితంగా తిరస్కరించాడు. ఉదయం పరుగు ప్రాక్టీసు చేసేందుకు సమయం లేక పోవడం వలన, ఇలా ఆఫీసు నుంచి ఇంటికే వెళ్ళే సమయంలో చేస్తున్నాని చెప్పు కొచ్చాడు.  

అదలా ఉంటే, ఇప్పుడు ప్రదీప్ మెహ్రా  స్పూర్తి దాయక, కథలో మరో మెరుపు మెరిసింది.    లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా (రిటైర్డ్) యువకుడి వీడియోను ట్వీట్ చేశారు.సహాయం చేసేందుకు  ముందుకొచ్చారు. ఆయన సంబందిత అధికారులతో మాట్లాడి, రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో అతనికి సహాయపడటానికి, అవసరమైన శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాటు చేశారు.ఈ విషయాన్ని దువా’ట్వీట్’ చేశారు.ప్రదీప్ మెహ్రా కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలని మనం అందరం కూడా, అతనికి బెస్ట్ ఆఫ్ లక్’ అందాం.. అతన్ని కన్న మాతృమూర్తికి పాదాభివందనం చేద్దాం. జై హింద్ ..జై భారత్ .. భారత్ మాతాకీ జై.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.