జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీ

Publish Date:Apr 13, 2025

Advertisement

వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కర్పొరేటర్లు ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్   తిప్పల వంశి జనసేన గూటికి చేరారు. 74 వ వార్డు కార్పొరేటర్ గా కొనసాగుతున్న వంశీ  వైసీపీ నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు. తిప్పలనాగిరెడ్డి  తొలి దశ నుంచి వార్డు అభివృద్ధిపై తమకు నిధులు కేటాయించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిధుల కేటాయింపు విషయమై  వంశీ కౌన్సిల్లో పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.

 తాజాగా జీవీఎంసీ లో మేయర్ పీఠాన్ని మార్చే క్రమంలో కూటమి నాయకులు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న  చర్చ జరగనుంది.  ఈ దశలో  వంశీ  వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడం నిస్సందేహంగా జగన్ పార్టీకి బిగ్ షాక్.  నిజానికి మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 74 మంది సభ్యుల అవసరం ఇప్పటికే కూటమికి 70 మంది సభ్యులు సహకారం ఉంది వీరితో పాటు మరో ఐదు వైసీపీ సభ్యులు  తమతో టచ్ లో ఉన్నారని   పలు సందర్భాల్లో కూటమి నేతలు చెబుతున్నారు.  దీనికి తగ్గట్టుగానే వంశీ పార్టీ మారడంతో వైసీపీ వర్గాల్లో నిరుత్సాహం వ్యక్తమౌతోంది.  ఇప్పటికే కార్పొరేటర్లు జారిపోకుండా శ్రీలంకలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  అయినప్పటికీ ఈ రకంగా పార్టీ కార్పొరేటర్లు జారిపోడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.  తాజాగా తిప్పల వంశీ మాజీ మంత్రి జనసేన నాయకుడు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు.  వార్డు అభివృద్ధి విషయంలో వివక్ష  కారణంగా వంశీ పార్టీ మారినట్లు ఆయన అనుచరులకు చెబుతున్నారు.

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.