Publish Date:Mar 13, 2025
సినీ నటుడు , వైకాపా నేత పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ మీద కర్నూలు జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు , పవన్ కళ్యాన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓబులాపురం పోలీసులు హైద్రాబాద్ లోని పోసాని నివాసంలో అరెస్ట్ చేసి రాజంపేట జైలుకు తరలించారు. అక్కడ నుంచి పోసాని ని నరసారావ్ పేట పోలీసులు పిటి వారెంట్ పై అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు తరలించారు. పిటి వారెంట్ పై అదోని పోలీసులు గుంటూరు జైలు నుంచి అదుపులో తీసుకుని కర్నూలు జైలుకు తరలించారు. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ పై కర్నూలు జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించారు. పిటి వారెంట్లను సవాల్ చేస్తూ పోసాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కర్నూలు జైలు నుంచి బెయిల్ పై పోసాని విడుదల అవుతారని అందరూ ఊహించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో అరెస్ట్ లు అనివార్యమయ్యాయి. సిఐడి కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు వాదనలు సమయంలో పోసాని బోరున విలపించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-shock-for-posani-14day-remand-to-guntur-jail-25-194321.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.