ఆనందయ్య మందుతో మరో అద్భుతం.. నేతల ముందే మిరాకిల్..
Publish Date:May 25, 2021
Advertisement
అతను ఓ స్టూడెంట్. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి అతని ఊరు. కరోనా సోకి అతని పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశాయి. కుటుంబ సభ్యులూ ఆశలు వదులుకున్నారు. కానీ, చివరి ప్రయత్నం ఒకటి చేసి చూద్ధామనుకున్నారు. ఆనందయ్య మందు ఇస్తే తమ పిల్లాడు బతుకుతాడనుకున్నారు. కానీ, ప్రస్తుతం ఏపీలో ఆనందయ్య మందు నిలిపేశారని ఎవరో చెప్పారు. అయితేనేం.. ఇక్కడ ఉన్నా ఎలానూ చనిపోయేదే.. అదేదో అక్కడికెల్లి అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నారు. వెంటనే అంబులెన్స్ వేసుకొని.. కరీంనగర్ నుంచి కృష్ణపట్టం వచ్చేశారు. అదే సమయంలో ఆనందయ్య మందు తయారు చేసే ప్రాంతాన్ని టీడీపీ ప్రతినిధి బృందం సందర్శించింది. సీనియర్ నేత సోమిరెడ్డి, బీద రవిచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నేతలు స్థానికంగా జరుగుతున్న ఔషధ పంపిణీని పరిశీలించారు. అదే టైమ్‌లో విషమ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ స్టూడెంట్‌ను సైతం అక్కడికి తీసుకొచ్చారు. సోమిరెడ్డి సమక్షంలోనే ఆ బాధితుడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు మందు చుక్కలు వేశారు. ఆశ్చర్యం. అద్భుతం. 15 నిమిషాల్లో ఆ విద్యార్థి లేచి కూర్చున్నాడు. అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు. కోలుకున్న విద్యార్థి సైతం జరిగిన మిరాకిల్‌ను కాసేపు నమ్మలేకపోయాడు. తనలాంటి ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న బాధితుల పాలిట అపరసంజీవని.. ఆనందయ్య మందు అంటూ కొనియాడాడు. తమలాంటి పేదలకు ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా చూడాలని అభ్యర్థించాడు. టీడీపీ నేత సోమిరెడ్డి సైతం తన కళ్ల ముందే జరిగిన ఘటన చూసి ఆశ్చర్యపోయారు. ఇంతటి మహత్యం ఉన్న ఆనందయ్య మందును పంపిణీ చేయకుండా.. పరీక్షలు, ప్రామాణికాలంటూ ప్రభుత్వం నిలిపివేయడం తగదంటూ మండిపడ్డారు. పాలకులు, అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయకుండా ఆనందయ్య ముందు పంపిణీ వెంటనే జరిగేలా సీఎం చొరవ తీసుకోవాలన్నారు. గతంలో కృష్ణపట్నం పోర్టు వల్ల దేశం మొత్తం కృష్ణపట్నం వైపు చూసిందని, మళ్లీ నేడు ఆనందయ్య మందువల్ల దేశమంతా కృష్ణపట్నం వైపు దృష్టిసారించిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు. ఇలా ఒకటా, రెండా.. ఆనందయ్య మందు ప్రభావం, ఫలితం వల్ల ఇప్పటికే వేలాది మంది కరోనా బారి నుంచి రక్షించబడ్డారు. కేవలం ఆయుర్వేద ప్రామాణికం పరంగా తయారీ విధానం లేదనే ఏకైకా కారణంతో ఆనందయ్య మందును అడ్డుకోవడం ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం. మందు తీసుకున్న వారంతా తమకు బాగుందని చెబుతున్నారు. అధికారులు, ఆయుష్ అధిపతి సైతం.. ఈ మందులో తప్పుబట్టాల్సింది ఏమీ లేదంటున్నారు. ఇచ్చేవారు సిద్ధంగా ఉన్నారు. తీసుకునే వారు ఎప్పుడెప్పుడా అని ఆరాటపడుతున్నారు. మరి ఎందుకు ఆలస్యం? జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆనందయ్య మందును ఎందుకు ఆపేసింది? పేదలకు సంజీవని లాంటి ఆనందయ్య మందు అందించకుండా సర్కారు ఎందుకు అడ్డుకుంటోంది?
http://www.teluguone.com/news/content/another-miracle-of-anandayya-medicine-25-116205.html





