Publish Date:Apr 16, 2024
చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కా ల్పుల్లో 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు. ఇద్దరు భధ్రతాసిబ్బందికి గాయాలయ్యాయి. చత్తీస్ గడ్ లో ఈ నెల మొదటి వారంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు హాయంలో రెండు ఎన్ కౌంటర్లు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇవ్వాళ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరగడం నక్సలైట్ల ఉనికి లేకుండా పాలకులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లా మన్పూర్ అటవీ ప్రాంతం పరిధిలోని పర్దోని దగ్గర మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా నలుగురు మావోయిస్టులు, ఒక ఎస్సై మరణించారు. చనిపోయిన వారిలో సీపీఐ మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్ అశోక్, ఏరియా కమిటీ మెంబర్ నరేటి కృష్ణ, దళ సభ్యులు సవిత, పరిమిళ ఉన్నారు. చనిపోయిన ఎస్సై పేరు శ్యామ్ కిషోర్ శర్మ. అయితే ఈ సంఘటనపై పోలీసుల వర్షన్ మాత్రమే ఇప్పటి వరకు తెలిసింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటన కానీ, స్థానికులు కానీ ఇంత వరకు మీడియాకు అమ్దుబాటులోకి రాలేదు.
అయితే పోలీసులు మాత్రం ఎప్పుడూ చెప్పే కథనే మళ్ళీ చెప్పారు. వారి కథనం ఏంటంటే....
మామదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో జరిగిన ఎన్ కౌంటర్ జరిగిన తీరు హృదయవిదారకంగా జరిగింది. మన్పూర్ కు నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అప్పటికే మాటు వేసిన మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులతో పాటు, ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-massive-encounter-in-chhattisgarh8-naxalites-killed-25-173984.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.