తెలుగుదేశంకు మరో గవర్నర్ పదవి.. రేసులో ఉన్నదెవరెవరంటే?

Publish Date:Aug 21, 2026

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ అధిష్ఠానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని  ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశ వ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉన్న ఐదు రాష్ట్రాల గవర్నర్ లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ ఐదు గవర్నర్ పదవులలో రెండింటిని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండింటిలోనూ ఒకటి ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు.   ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.

ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అవ్వడంతో, రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం తరఫున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపికౌతారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాగా గవర్నర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వారిలో  సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ యనమలరామృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే సీనియర్ నాయకుడు కేఈ క్రిష్ణమూర్తిలు ఉన్నారు. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన వారు కాగా, ప్రతిభా భారతి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా ఆరంభం నుంచీ తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి ముగ్గురిలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి, ఉత్కంఠా సర్వత్రా నెలకొని ఉంది.  

Another Governer post for TDP,  NDA Governor Appointments, Yanamala Ramakrishnudu, Pratibha Bharati, KE Krishnamurthy, Chandrababu Naidu, TeluguOne

By
en-us Political News

  
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.