పచ్చి బాలింతపై సామూహిక అత్యాచారం..హత్య.. జగన్ పాలనలో కీచకపర్వానికి అంతే లేదా?
Publish Date:May 10, 2022
Advertisement
జగన్ పాలనలో ఏపీలో కీచక రాజ్యం నడుస్తోంది. మహిళలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొని ఉంది. వరుస సంఘటనలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నా.. సర్కార్ కు చీమైనా కుట్టడం లేదు. పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో తాజాగా ఓ పచ్చి బాలింతపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ తరువాత బండరాయితో మోది మత్య చేశారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. నెలల బాబును సమీప బంధువుకు అప్పగించి బహిర్భూమికి బయటకు వెళ్లిన ఆమెపై దుండగులు దారుణానికి పాల్పడ్డారు. పది గంటల తరువాత ఆమె మృతదేహాన్ని బంధువులు ఊరి బయట కనుగొన్నారు. ఎంతకీ ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో గాలింపు చేపట్టిన ఆమె బంధువులకు ఊరిబయట విగత జీవిగా కనిపించింది.
పోలీసులు ప్రాథమికంగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత బండరాయితో మోడీ చంపేసినట్లు నిర్ధారణకు వచ్చాను. నలుగు అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/another-gang-rape-and-murder-incident-in-ap-25-135685.html





